దివి కిడ్నాప్.. వామ్మో అభిజీత్ ప్లాన్ మామూలుగా లేదుగా.. బూతులతో రెచ్చిపోయిన సోహెల్
బిగ్‌బాస్ షో మూడో వారం మంచి రసపట్టు మీదుంది. నామినేషన్ ప్రక్రియలోనే ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. అలాంటిది ఫిజికల్ టాస్కులు ఇస్తే ఊరుకుంటారా? అసలు ఇంత వరకు ఎలాంటి ఫిజికల్ టాస్కులు ఇవ్వలేదు. నిన్న ఇచ్చిన ఉక్కు హృదయం టాస్క్ ఓ రేంజ్‌లో వర్కౌట్ అయింది. మనుషులు రోబోలు అంటూ రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. ఇక మీలో మీరు తన్నుకోండి అంటూ తగువు పెట్టేశాడు.

టాస్క్ కథ ఏంటంటే?
ఉక్కు హృదయం అనే ఈ టాస్క్‌లో రోబోల టీంలో అభిజీత్, కుమార్ సాయి, ఆరియానా, హారిక, దేవీ నాగవల్లి, గంగవ్వ, అవినాష్‌లు ఉన్నారు. మిగతా వారంతా మనుషుల టీంలో ఉన్నారు. సిల్వర్ బంతిని పగలగొడితే ఒక రోబో చనిపోతుంది.. చివరి వరకు ఒక్క రోబో అయినా మిగిలినా మనుషుల టీం ఓడిపోతుంది. అయితే గెలిచిన టీం సభ్యులే కెప్టెన్సీకి అర్హులని మెలికపెట్టాడు.

ఎవరి మొండి పట్టు వారిదే..
ఇక ఇలా ఈ టాస్క్‌లో గార్డెన్ ఏరియా, రోబోలకు కావాల్సిన చార్జింగ్ మనుషుల టీం అధీనంలో ఉండగా.. మనుషులకు అవసరమైనవన్నీ రోబోల అధీనంలో ఉన్నాయి. ఇరు టీమ్స్ ఒప్పందానికి వచ్చి ఇచ్చి పుచ్చుకుని టాస్క్‌ను ముందుకు తీసుకువెళ్లాలి. మొదట అమ్మ రాజశేఖర్‌కు ఓ సిగరెట్ ఇవ్వడానికి రోబో టీం బెట్టు చేసింది. అక్కడ వారికి బేరం కుదరలేదు. ఒక సిగరెట్‌కు ఒక రోబోకు చార్జింగ్ అనే ఒప్పందానికి వారు ఒప్పుకోలేదు.

చార్జింగ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు..
అయితే రోబోల చార్జింగ్‌లు పూర్తిగా తగ్గిపోతూ ఉంటే.. వారు బేరానికి దిగారు. అప్పుడు మనుషుల టీం బెట్టు చేసింది. తమకు ఎలాంటి అవసరాలు లేవనీ పుడ్ బెడ్ లేకపోయినా ఓర్చుకుంటామని రోబోలకు చార్జింగ్ ఇవ్వడానికి నిరాకరించారు. నిన్నటితో టాస్కు అలా అసంపూర్ణంగా ఉండిపోయింది.

అభిజీత్ మాస్టర్ ప్లాన్..
ఇక మనుషులు చార్జింగ్ ఇవ్వడం లేదని అభిజీత్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఫిజికల్‌గా ఎలాంటి పని చేయకపోయినా అదిరిపోయే ఐడియా ఇచ్చాడు. ఓ మనిషిని కిడ్నాప్ చేద్దాం.. లోపలకి వచ్చేలా చేసి.. కాళ్లు చేతులు పట్టేసి.. మనం చార్జింగ్ పెట్టుకుందామని ఐడియా ఇచ్చాడు.
Recommended Video

రెచ్చిపోయిన మెహబూబ్, సోహెల్
దీంతో పథకం ప్రకారం దివిని కిడ్నాప్ చేశారు. ఇక ఈ ఘటనతో మెహబూబ్, సోహెల్ తెగ రెచ్చిపోయారు.బూతులు కూడా వాడేశారు. దమ్ముంటే నన్ను తీసుకెళ్లండిరా అంటూ మెహబూబ్ సవాల్ విసిరాడు. ఇక మొత్తానికి ఈ టాస్క్ ఈ రోజు మరింత ఎంటర్టైన్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











