చివరికి అతన్ని బిగ్ బాస్ విన్నర్ అనేశారు.. అంత సీన్ లేదమ్మా..
బిగ్ బాస్ లో ట్విస్టులు అనేవి చాలా కామన్ అయినప్పటికీ అవి ఆడియెన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉండాలి కానీ చిరాకు తెప్పించేలా ఉండకూడదు. అసలే రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న క్రమంలో అతిగా ఆలోచించి నిర్వహకులు వేస్తున్న ప్లాన్స్ కొంత మైనెస్ అయ్యేలా ఉన్నాయని అనిపిస్తోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం పస తగ్గిందని అనుకున్న క్రమంలో కాస్త హైప్ క్రియేట్ చేయాలని గట్టిగానే ప్లాన్ వేశారు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అయినా గ్యారెంటీ లేదు
అమ్మా రాజశేఖర్ వెళ్లిపోయినప్పటి నుంచి ఫన్ తగ్గిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక చాలా వరకు అమ్మా ఎలిమినేషన్ పై కూడా నెగిటివ్ టాక్ ఎక్కువవుతోంది. ఆ సంగతి అటుంచితే హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కూడా గ్యారెంటీ ఉండదని చెప్పాలని అనుకున్నారో ఏమో గాని బిగ్ బాస్ ఇన్ డైరెక్ట్ గా విన్నర్ ని సెలెక్ట్ చేయమని చెప్పేశారు.

అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్..
హౌజ్ లో ఎవరైతే బలంగా ఉన్నారు? చివరి వరకు తమకు పోటీ వచ్చేది ఎవరు? అనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి అందరు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయాలని చెప్పగా.. చర్చల అనంతరం అఖిల్ ని నీలబెట్టడం గమనార్హం. అంతా బాగానే ఉంది కాని అఖిల్ ని ఒక విధంగా బిగ్ బాస్ విన్నర్ గా నిలబెట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వడం ఏమిటనే కామెంట్స్ కూడా ఎక్కువవుతున్నాయి.

ఇది నిజంగా మరో వండర్
అఖిల్ ఒక విధంగా మోనాల్ లేకపోతే ఎక్కువగా హైలెట్ అయ్యే అవకాశమే లేదు. అప్పుడప్పుడు ఫిజికల్ టాస్క్ లో హడావుడి చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువగా ట్రయాంగిల్ లవ్ స్టొరీ ద్వారానే బిగ్ బాస్ కెమెరాలు అతని వైపుకు తిరిగాయి. చూస్తుంటే మోనాల్ ఉన్నన్ని రోజులు అఖిల్ కూడా ఉంటాడని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక అలాంటి పర్సన్ ని బిగ్ బాస్ విన్నర్ కు అర్హత కలిగిన్నట్లు చెప్పడం మరో వండర్ ఆనిపిస్తోంది.
Recommended Video

మరోసారి టార్గెట్ చేశారా?
సాధారణంగా హౌజ్ మెంట్స్ ఎలిమినేషన్ సమయానికి ఒక్కరినే టార్గెట్ చేస్తున్నట్లు అనిపించింది. కుమార్ సాయి విషయంలో ఏం జరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అరియానా డేంజర్ జోన్ లోకి నెట్టేశారు. మరో అవకాశం రావడంతో అఖిల్ ని టార్గెట్ చేసినట్లు అనుమానం వస్తోంది. ఎవరో ఒకరిని పంపాలి కాబట్టి అఖిల్ ని సెలెక్ట్ చేయడం బెటర్ అని ఆలోచించినట్లు అర్ధమవుతోంది. మరి రానున్న రోజుల్లో ఈ నిర్ణయం ఎలాంటి గొడవలకు కారణమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











