బిగ్ బాస్4: అఖిల్, అభిజిత్ కి చుక్కలు చూపిస్తున్న అవినాష్.. మోనాల్ మనసులో అతనే..
బిగ్ బాస్ సిజన్ 4 మొత్తానికి ఒక ట్రాక్ లోకి వచ్చినట్లు అర్ధమవుతోంది. మొన్నటివరకు షోపై అంతగా ఇంట్రెస్ట్ చూపని జనాలు ఇప్పుడు మాత్రం మెల్లగా షోపై ఒక లుక్కేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త టాస్క్ లతో బిగ్ బాస్ హౌజ్ మెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక కంటెస్టెంట్స్ కూడా ఎమోషన్స్ ని పక్కనపెట్టి గేమ్ పై దృష్టి పెడుతున్నారు. ఇక బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ కూడా జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.

లవ్ ట్రాక్ లో ఊహించని మలుపులు
బిగ్ బాస్ మొదటి మూడు సీజన్స్ లలో ఎవరో ఒకరు మాత్రమే లవ్ ట్రాక్ ను కొనసాగించే వారు. మధ్యలో ఎవరైనా వచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ ఈ సారి మాత్రం అఖిల్, అభిజిత్, మోనాల్ లవ్ ట్రాక్ మాత్రం ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. ఒక అమ్మాయిపై ఇద్దరు యువకులు ఆశలు పెంచుకున్నట్లు ఈజీగా అర్ధమవుతోంది.

మధ్యలో దూరిన అవినాష్
నిజానికి మొన్నటివరకు వీరి లవ్ ట్రాక్ తోనే బిగ్ బాస్ షోను ఎక్కువగా హైలెట్ చేశారు. వారికి సంబంధించిన ప్రోమోలో వదలడంతో ప్రేమ దేశం టీజర్లు వదిలినట్లు అనిపించింది. ఇక నిత్యం వారిపై మీమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు వారి మధ్యలో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ చేరాడు. అసలే ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న మోనాల్ ఇప్పుడు అవినాష్ రాకతో తెలియకుండానే అతనికి అట్రాక్ట్ అవుతోంది.

వారిని మించి పోయేలా మసాలా కలిపేస్తున్నాడు
అభిజిత్, అఖిల్ మాత్రమే పులిహోర కలపడంలో మేధావులు అనుకుంటే.. ముక్కు అవినాష్ వారిని మించి పోయేలా మసాలా కూడా గట్టిగా కలిపేస్తున్నాడు. రీసెంట్ ఎపిసోడ్స్ గమనిస్తే అవినాష్ మోనాల్ ను సరదాగా టీజ్ చేస్తూనే మెల్లగా లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. తన మాటలతోనే మోనాల్ మనసును గట్టిగానే టచ్ చేస్తున్నాడు.
Recommended Video

మరి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో..
అవినాష్ తీరుకు అభిజిత్, అఖిల్ చుక్కలు కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. మోనాల్ లవ్ ట్రాక్ తోనే మంచి క్రేజ్ వస్తోందని హ్యాపీగా కంటిన్యూ చేస్తున్న తరుణంలో అవినాష్ వచ్చి ప్లాన్ మొత్తం తారుమారు చేసినట్లు అర్థమవుతోంది. చూస్తుంటే అవినాష్ జోరుకు మోనాల్ ని ఈ వారంలోనే పూర్తిగా తనవైపుకు తిప్పుకునెలా ఉన్నాడని కూడా అనిపిస్తోంది. మరి బిగ్ బాస్ ఈ లవ్ ట్రాక్ కి ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











