నాగబాబు దారిలోనే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్.. అవినాష్‌ను కాదని అభిజిత్‌కే ఓటు!!

బిగ్ బాస్ షో ముగిసేందుకు సమయం దగ్గరపడుతోంది. పన్నెండో వారం కూడా గడిచిపోయింది. ఇక ఫినాలే ఎపిసోడ్‌కు రెండు వారాలే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఇంట్లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. రానున్న వారాల్లో కెప్టెన్ ఉండబోడని బిగ్ బాస్ ప్రకటించేశాడు. ఫినాలే రేసు మొదలైందని కూడా బిగ్ బాస్ హెచ్చరించాడు. టాప్ 5 కంటెస్టెంట్లలో ఎవరు ఉంటారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారని ఉత్కంఠ అయితే ఉంది. కానీ బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరు అన్న విషయంలో మాత్రం ఎలాంటి గందరగోళం లేదు.

అభిజిత్ విన్నర్..

అభిజిత్ విన్నర్..

బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో అనేది శక్తి సామార్థ్యాలు కండలు ప్రదర్శించే ఆట కాదని.. ఓ మనిషి ఎలా ఉంటాడు.. కోపం వస్తే ఎలా మారుతాడు.. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైతే ఎలా వ్యవహరిస్తాడనేది ఆట. ఆ విషయాలన్నంటిలో అభిజిత్ బెస్ట్ అంటూ అతనే విన్నర్ అవుతాడని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

నాగబాబు వ్యాఖ్యలు..

నాగబాబు వ్యాఖ్యలు..

అయితే ఈ టైటిల్ విన్నర్ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు ఆ మధ్య మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. అభిజిత్ తనకు ఇష్టమని అతను మొదటి నుంచి అలాగే ఉన్నాడని ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటున్నాడని, బయట ఒకట్రెండు సార్లు కనిపించాడని ఎంతో డౌన్ టు ఎర్త్ అని నాగబాబు చెప్పుకొచ్చాడు. తన మద్దతు అభిజిత్‌కే ఉంటుందని తెలిపాడు. అవినాష్ అప్పుడప్పుడు కోపంలో అసలు మనిషి బయటకు వస్తున్నాడంటూ కామెంట్ చేశాడు. అయితే అవినాష్ కూడా చివరి వరకు ఉండాలని నాగబాబు కోరుకున్నాడు.

తాజాగా బుల్లెట్ భాస్కర్..

తాజాగా బుల్లెట్ భాస్కర్..

తాజాగా జబర్దస్త్ ఆర్టిస్ట్ బుల్లెట్ భాస్కర్ కూడా అభిజిత్‌కు మద్దతు ప్రకటించాడు. తాను అభిజిత్‌కే సపోర్ట్ చేస్తానని తెలిపాడు. మొదటి నుంచి ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు.. నీతిగా నిజాయితీగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. అన్ని ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటున్నాడని బుల్లెట్ భాస్కర్ పేర్కొన్నాడు.

సహనం గొప్ప..

సహనం గొప్ప..

అభిజిత్ కోపాన్ని కూడా ఎంతో బాగా కంట్రోల్ చేసుకుంటున్నాడు.. సహనంగా ఉండటం చాలా గొప్ప అని బుల్లెట్ భాస్కర్ పేర్కొన్నాడు. అభిజిత్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. తన ఓటు అభిజిత్‌కే అని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Actor Ananda Chakrapani Interview Part 3
అవినాష్‌పై అలా..

అవినాష్‌పై అలా..

అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా అవినాష్ అంటే కూడా ఇష్టమేనని కానీ అభిజిత్‌కే తన సపోర్ట్ అని బుల్లెట్ భాస్కర్ చాలా క్లియర్‌గా చెప్పాడు. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను చూస్తే అభిజిత్ విన్నర్ అని తేలిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X