twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మలుపు తిరగనున్న ఆట.. అవినాష్‌కు ఇది గడ్డుకాలం.. రంగంలోకి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు!!

    |

    బిగ్ బాస్ షోలో పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాడు షో రసవత్తరంగా సాగింది. కొందరికి అదృష్టం వరించగా.. ఇంకొందరికి దురదృష్టం వరించింది. పన్నెండో వారంలో నామినేషన్ ప్రక్రియను కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. టోపీలు పెట్టుకోమని ఆదేశించడం, అందులో గ్రీన్, రెడ్ కలర్స్‌ను నింపడంతో అందరూ షాక్ అయ్యారు. టోపీల్లో రంగులు పెట్టి పన్నెండో వారం నామినేషన్స్‌ను లక్ మీద ఆధారపడేట్టు చేశాడు.

    ఆ నలుగురు నామినేషన్స్‌లోకి..

    ఆ నలుగురు నామినేషన్స్‌లోకి..

    ఎర్ర రంగు ఉన్న టోపీలను అఖిల్ అభిజిత్ అరియానా అవినాష్‌లు పెట్టుకున్నారు. సోహెల్, మోనాల్‌లు సెలెక్ట్ చేసుకున్న టోపీల్లో గ్రీన్ కలర్ వచ్చింది. నామినేషన్ ప్రక్రియలో సెకండ్ లెవెల్‌లో స్వాపింగ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. చివరకు మోనాల్, సోహెల్ ఎవ్వరూ కూడా స్వాపింగ్‌కు సిద్దంగా లేకపోవడంతో.. కెప్టెన్ హారికకు బిగ్ బాస్ ఓ ఆదేశాన్ని ఇచ్చాడు. అలా కెప్టెన్సీ అధికారంతో మోనాల్‌ను అభిజిత్‌తో స్వాప్ చేసింది. అలా మోనాల్, అఖిల్, అవినాష్, అరియానాలు నామినేట్ అయ్యారు.

    నోరు జారిన అవినాష్..

    నోరు జారిన అవినాష్..

    అయితే స్వాపింగ్ కోసం అవినాష్ మోనాల్‌తో మాట్లాడిన తీరుతో అతనిపై నెగెటివిటీ పెరిగింది. మోనాల్‌పై ఇష్టమొచ్చినట్టుగా చెలరేగిపోయాడు. ఇంట్లో ఉందే నీకు అర్హత లేదు.. నువ్ ఈ షోకు పనికి రావు.. నీ కంటే నేనే బెటర్ 200 పర్సెంట్ టాస్కులు ఆడాను అంటూ ఇలా విర్రవీగాడు. అలా రెచ్చిపోయి గొప్పలు చెప్పుకోవడంతో అవినాష్‌పై నెగెటివిటీ పెరిగింది.

     లీకులతో అలా..

    లీకులతో అలా..

    అయితే నేటి ఎపిసోడ్‌లో అవినాష్‌కు అదిరిపోయే ఆఫర్ లభించినట్టు లీకులు అందుతున్నాయి. నామినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గెలిచిన వారికి రెండు వారాల ఇమ్యూనిటీ ఇచ్చాడని, అలా అవినాష్‌కు రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చిందని.. ఒకవేళ ఈ వారం కనుక అవినాష్ సేవ్ అయితే నేరుగా టాప్ 5లోకి చేరినట్టే అని తెలుస్తోంది.

     సోషల్ మీడియాలో టాక్..

    సోషల్ మీడియాలో టాక్..

    ఈ మేరకు అవినాష్‌ను పంపించేందుకు వ్యూహం సిద్దం చేస్తున్నట్టు నెటిజన్ల మాటలను బట్టి తెలుస్తోంది. హారిక, అభిజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా మోనాల్‌కు ఓటు వేయాలని, ఈసారి ఎలాగైనా అవినాష్‌ను పంపించాలి లేదంటే రెండు వారాల ఇమ్యూనిటీతో టాప్ 5లోకి వచ్చేస్తాడని కామెంట్లు పెడుతున్నారు.

    Recommended Video

    Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
    రంగంలోకి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు..

    రంగంలోకి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు..

    ఇప్పుడు అవినాష్‌ గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ వారం గట్టెక్కితే నేరుగా టాప్ 5లోకి చేరుతాడు. అందుకే ఈ వారాంలో అవినాష్‌కు ఓట్లు వేయండి అని జబర్దస్త్ గెటప్ శ్రీను, ధన్ రాజ్ వంటివారు పోస్ట్‌లు పెడుతున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అవినాష్ సేవ్ అయితే మాత్రం అతనంత లక్కీ ఫెల్లో మరెవ్వరూ ఉండరు.

    English summary
    Jabardasth Artist Campaign About Avinash, Bigg Boss 4 telugu abhijeet and Sohail In Top 2 Positions, Mehaboob about Abhijeet, Bigg Boss 4 telugu week 11 Captaincy Task Goes Viral, Bigg Boss 4 telugu week 11 Abhijit Mother Reaction Disputes With Contestants, Bigg Boss 4 Telugu week 11 Avinash Fun With Ariyana, Akhil About Harika With Sohel, Nagarjuna Gift Mutton To Contestants, Bigg Boss 4 Telugu Week 10 Sohel Cried On Mehaboob Elimination, Mehaboob To Akhil On Elimination, Mehaboob To ABhijeet After Elimination, Sohel Emotional On Mehaboob Elimination, Sohel Comments On Abhijeet, Harika Humiliates Sohel, Sohel Punch To Abhijeet, Bigg Boss 4 Telugu week 10 Diwali Gifts For Housemate, Bigg Boss 4 Telugu week 10 Avinash Is Beaten by Housemate, Bigg Boss 4 Telugu week 10 Ariyana Secret Didn't workout, Bigg Boss 4 Telugu week 10 Akhil Sent to Secret Room, Bigg Boss 4 Telugu week 10 Is Mehaboob Missed captaincy,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X