Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మలుపు తిరగనున్న ఆట.. అవినాష్‌కు ఇది గడ్డుకాలం.. రంగంలోకి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు!!
బిగ్ బాస్ షోలో పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాడు షో రసవత్తరంగా సాగింది. కొందరికి అదృష్టం వరించగా.. ఇంకొందరికి దురదృష్టం వరించింది. పన్నెండో వారంలో నామినేషన్ ప్రక్రియను కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. టోపీలు పెట్టుకోమని ఆదేశించడం, అందులో గ్రీన్, రెడ్ కలర్స్‌ను నింపడంతో అందరూ షాక్ అయ్యారు. టోపీల్లో రంగులు పెట్టి పన్నెండో వారం నామినేషన్స్‌ను లక్ మీద ఆధారపడేట్టు చేశాడు.
ఆ నలుగురు నామినేషన్స్‌లోకి..
ఎర్ర రంగు ఉన్న టోపీలను అఖిల్ అభిజిత్ అరియానా అవినాష్‌లు పెట్టుకున్నారు. సోహెల్, మోనాల్‌లు సెలెక్ట్ చేసుకున్న టోపీల్లో గ్రీన్ కలర్ వచ్చింది. నామినేషన్ ప్రక్రియలో సెకండ్ లెవెల్లో స్వాపింగ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. చివరకు మోనాల్, సోహెల్ ఎవ్వరూ కూడా స్వాపింగ్‌కు సిద్దంగా లేకపోవడంతో.. కెప్టెన్ హారికకు బిగ్ బాస్ ఓ ఆదేశాన్ని ఇచ్చాడు. అలా కెప్టెన్సీ అధికారంతో మోనాల్‌ను అభిజిత్‌తో స్వాప్ చేసింది. అలా మోనాల్, అఖిల్, అవినాష్, అరియానాలు నామినేట్ అయ్యారు.
నోరు జారిన అవినాష్..
అయితే స్వాపింగ్ కోసం అవినాష్ మోనాల్‌తో మాట్లాడిన తీరుతో అతనిపై నెగెటివిటీ పెరిగింది. మోనాల్‌పై ఇష్టమొచ్చినట్టుగా చెలరేగిపోయాడు. ఇంట్లో ఉందే నీకు అర్హత లేదు.. నువ్ ఈ షోకు పనికి రావు.. నీ కంటే నేనే బెటర్ 200 పర్సెంట్ టాస్కులు ఆడాను అంటూ ఇలా విర్రవీగాడు. అలా రెచ్చిపోయి గొప్పలు చెప్పుకోవడంతో అవినాష్‌పై నెగెటివిటీ పెరిగింది.
లీకులతో అలా..
అయితే నేటి ఎపిసోడ్లో అవినాష్‌కు అదిరిపోయే ఆఫర్ లభించినట్టు లీకులు అందుతున్నాయి. నామినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గెలిచిన వారికి రెండు వారాల ఇమ్యూనిటీ ఇచ్చాడని, అలా అవినాష్‌కు రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చిందని.. ఒకవేళ ఈ వారం కనుక అవినాష్ సేవ్ అయితే నేరుగా టాప్ 5లోకి చేరినట్టే అని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో టాక్..
ఈ మేరకు అవినాష్‌ను పంపించేందుకు వ్యూహం సిద్దం చేస్తున్నట్టు నెటిజన్ల మాటలను బట్టి తెలుస్తోంది. హారిక, అభిజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా మోనాల్‌కు ఓటు వేయాలని, ఈసారి ఎలాగైనా అవినాష్‌ను పంపించాలి లేదంటే రెండు వారాల ఇమ్యూనిటీతో టాప్ 5లోకి వచ్చేస్తాడని కామెంట్లు పెడుతున్నారు.
Recommended Video
రంగంలోకి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు..
ఇప్పుడు అవినాష్ గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ వారం గట్టెక్కితే నేరుగా టాప్ 5లోకి చేరుతాడు. అందుకే ఈ వారాంలో అవినాష్‌కు ఓట్లు వేయండి అని జబర్దస్త్ గెటప్ శ్రీను, ధన్ రాజ్ వంటివారు పోస్ట్‌లు పెడుతున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అవినాష్ సేవ్ అయితే మాత్రం అతనంత లక్కీ ఫెల్లో మరెవ్వరూ ఉండరు.