రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ‘జోకర్’ అవుతాడా? హీరోగా బయటకు వస్తాడా?

నెమ్మదిగా, నత్తనడకన సాగుతున్న షోను ఒక్కసారిగా పైకి లేపేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే అస్త్రాన్ని వాడుతాడు బిగ్‌బాస్. ఈ సీజన్‌లో రెండో వారంలో ఫస్ట్ రోజే ఓ వైల్డ్ కార్డ్‌ను ప్రవేశపెట్టాడు. ఇక తాజాగా రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన హింట్ కూడా ఇచ్చాడు. అయితే ప్రోమోలో అంత క్లియర్‌గా కనబడకపోయినా అది ఎవరన్నది అందరికీ తెలిసిపోయింది. ఆ విషయంలో గతంలోనే లీకైపోయింది. కానీ బిగ్‌బాస్‌కు ఆ విషయం తెలీదు. అందుకే సస్పెన్స్ మెయింటేన్ చేద్దామని ఓ ఆసక్తిని కలిగించేలా ప్రోమోను విడుదల చేశాడు.

ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

ఈ నాల్గో సీజన్‌లో వచ్చిన మొదటి వైల్డ్ కార్డ్ కుమార్ సాయి. తెరపై నవ్వులు పూయించిన ఈ కమెడియన్‌ను బిగ్‌బాస్ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసలే ఈ కంటెస్టెంట్లు కాస్త వెరైటీగా ఉన్నారు. కొత్తగా వచ్చిన వారిని ఏదో అంటరాని వారిగా చూస్తున్నారు. సోహెల్, అరియానాలు రెండో రోజులు నైబర్ రూంలో ఉండి వస్తే వారిని కూడా దూరంగానే పెడుతున్నారు. ఇక వైల్డ కార్డ్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

విఫలమైన వైల్డ్ కార్డ్..

విఫలమైన వైల్డ్ కార్డ్..

అలా ఈ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బెడిసికొట్టింది. కుమార్ సాయి ఉన్నాడన్న విషయం కూడా ప్రేక్షకులు గుర్తించడం లేదు. ఏ హడావిడి లేదు. ఏ హౌస్ మేట్ కూడా అతనితో ఉండటం లేదు.. అతను కూడా ఎవ్వరితోనూ మాట్లాడినట్టు కనిపించడం లేదు. పైగా వచ్చిన మొదటి వారంలోనే నామినేషన్‌లో వచ్చి పడ్డాడు. చూస్తుంటే మనోడు తట్టాబుట్టా సర్దుకునేట్టు కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు.

జోకర్ అంటూ ఎంట్రీ..

జోకర్ అంటూ ఎంట్రీ..

ఇక నాల్గో సీజన్‌లో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో తనకు తాను జోకర్ అంటూ సంబోధించుకున్నాడు. ఆ జోకర్ వెనుక కూడా ఓ జీవితం ఉందని చెబుతూ గ్రాండ్‌గానే ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ షోలో కేవలం జోకర్‌గానే మిగిలిపోతాడా? లేదా హీరోగా మారి బయటకు వెళ్లిపోతాడా? అన్నది చూడాలి.

Recommended Video

Bigg Boss Telugu 4 : జోకర్ గా Jabardasth Avinash వైల్డ్ కార్డ్ ఎంట్రీ..!!
ట్రయాంగిల్ కథతో హైప్..

ట్రయాంగిల్ కథతో హైప్..

ఇప్పటి వరకు నాల్గో సీజన్‌లో ఇంట్రెస్టింగ్ పాయింటే బయటకు రాలేదు. ఈ మధ్యే అఖిల్ మోనాల్ అభిజీత్ ట్రాక్ బాగా వైరల్ అవుతోంది. ప్రేమ దేశం, ఆర్య 2 అంటూ వీరిపై రకరకాల మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ ట్రయాంగిల్ కథపై లాస్య, సుజాత బాగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ స్టఫ్‌తోనే నాల్గో సీజన్ రన్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X