అంతా తేడా గ్యాంగ్.. బిగ్‌బాస్‌లో జంబ లకిడి పంబ.. రెచ్చిపోయిన కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ షోలో నాల్గో వీకెండ్ అంతా సందడి సందడిగా ఉండబోతోంది. శనివారం నాటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేషన్‌కు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేశారు. ఇంకో ఎలిమినేషన్ ఉందంటూ జనాలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ రెండో ఎలిమినేషన్ సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ రోజు సండే ఫండేగా మార్చేందుకు నాగార్జున మంచి ప్లానే వేశాడు. ప్రతీ సీజన్‌లో ఈ టాస్క్ ఉండటం సర్వసాధారణమేనన్న సంగతి తెలిసిందే.

స్వాతి అవుట్..
సంప్రదాయానికి భిన్నంగా శనివారం నాడే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది నేరుగా ప్రకటించేశాడు నాగ్. నామినేట్ అయిన వారిలో సేవ్ అయిన కంటెస్టెంట్ల పేర్లు చెప్పకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ అని చెప్పి స్వాతి దీక్షిత్‌ను బయటకు పట్టుకొచ్చారు. నేరు మరో ఎలిమినేషన్ ఉందని నాగ్ చెబుతున్నాడు.

జంబలకిడి పంబ..
ప్రతీ సీజన్‌లో ఈ జంబ లకిడి పంబ అనే టాస్క్ ఉండనే ఉంటోంది. ఈసారి కూడా ఆ టాస్కును నేడు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు వీర లెవెల్‌లో రెచ్చిపోయారు. మగ కంటెస్టెంట్లందరూ ఆడవారి గెటప్‌లతో ఆకట్టుకునేందుకు బాగానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. ఇక అమ్మాయిలందరూ మగవారి గెటప్‌లో దుమ్ములేపేందుకు రెడీ అయ్యారు.

స్కిట్స్‌తో రచ్చ..
ఇక ఇందులో అందరూ కలిసి స్కిట్స్ వేసినట్టు కనిపిస్తోంది. నోయల్-దివి అతడు స్ఫూప్, హారిక- అవినాష్ ఖుషీ స్ఫూస్‌తో రచ్చ రచ్చ చేసినట్టు తెలుస్తోంది. ఇక గంగవ్వ యథావిథిగా ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు కాబట్టి.. ఆమెతో కుమార్ సాయి పర్ఫామ్ చేశాడు. మెహబూబ్, అభి, అఖిల్ గెటప్పులు మరీ దారుణంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
Recommended Video
నాగ్ పంచ్‌లు..
అవినాష్-హారికలు చేసిన ఖుషీ స్పూప్‌పై నాగార్జున బాగానే సెటైర్లు వేశాడు. ఆ నడుమును చూస్తే ఏదైనా మరిచిపోతారు అంటూ అవినాష్‌పై కౌంటర్లు వేశాడు. రాత్రి ఎలాంటి కలలు వస్తాయో.. అంటూ నాగార్జున భయపడ్డాడు. మొత్తానికి ఈ జంబ లకిడి పంబ వర్కవుట్ అయ్యేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











