బిగ్‌బాస్ అందుకే ఆమెను సేవ్ చేస్తుంటాడు.. మోనాల్‌ డ్రెస్సింగ్‌పై కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్

బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లు చేసే రచ్చ ఒకలా ఉంటే.. బయటకు వచ్చాక వారు చేసే కామెంట్లు మరో లెవెల్‌ల్ ఉంటాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు లోపల ఉన్న వారి గురించి అసలు నిజలు చెబుతుంటారు. వారు ఎలాంటి వాళ్లు? అసలు మనస్తత్వం ఏంటి? షోలో జరిగింది ఏంటి? మనకు చూపించింది ఏంటి? ఇలా ఎన్నో రకాలైన అనుమానాలుంటాయి. అలాంటి వాటికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా కరాటే కళ్యాణి, సుజాత కలిసి ఓ మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఎన్నో విషయాలపై క్లారిటీ..

ఎన్నో విషయాలపై క్లారిటీ..

బయటకు వచ్చిన కరాటే కళ్యాణి.. సుజాత నవ్వు ఫేక్ అంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఎప్పుడూ అలానే నవ్వుతూ ఉంటానని, తనకు నవ్వడం ఇష్టమని, అయితే పుటేజ్ కోసం ఎప్పుడూ నవ్వలేదని సుజాత కరాటే కళ్యాణికి ఓ క్లారిటీ ఇచ్చింది.

ఎలిమినేషన్ విషయంలో..

ఎలిమినేషన్ విషయంలో..

నాల్గో సీజన్‌లో జరుగుతోన్న ఎలిమినేషన్ ప్రక్రియపై ఎందరికో అనుమానాలున్నాయి. మూడో వారం నుంచి ఈ ఎలిమినేషన్ విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. మొదటగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని లీకులు వచ్చాయి. మళ్లీ కాసేపటికే దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిందని ప్రచారం జరిగింది. ఈ విషయంలో అందరికీ నేటికీ అనుమానాలున్నాయి.

 ఇదే విషయంపై..

ఇదే విషయంపై..

ఇలా ఎలిమినేషన్ విషయంలో తమకు కూడా అనుమానాలున్నాయని సుజాత, కరాటే కళ్యాణిలు చెప్పుకొచ్చాడు. ఐదో వారం ఎలిమినేషన్ గురించి కరాటే కళ్యాణి మాట్లాడుతూ మోనాల్, అమ్మ రాజశేఖర్, సుజాతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

కనబడేలా బట్టలు..

కనబడేలా బట్టలు..

తాను ఐదో వారం నామినేషన్ గురించి ముందే ఊహించానని మోనాల్, అమ్మ రాజశేఖర్, సుజాతలలో ఎవరో ఒకరు వెళ్తారని అనుకున్నట్టు కరాటే కళ్యాణి చెప్పింది. మోనాల్ కచ్చితంగా వెళ్లదు వీకెండ్‌లో కాస్త గ్లామర్ షో చేస్తూ కనబడేలా బట్టలు వేసుకుంటుంది.. మేం అలా చేయలేం కాబట్టి మమ్మల్ని బయటకు పంపిచేస్తారు. వాళ్లకు వాళ్లకు ఏదో లింకులు ఉంటాయి కదా అంటూ మోనాల్‌పై కరాటే కళ్యాణి కామెంట్స్ చేసింది.

Recommended Video

Wrong Gopal Varma Movie Official Trailer
మెహబూబ్‌ను కావాలనే..

మెహబూబ్‌ను కావాలనే..

మెహబూబ్‌ను కావాలనే సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందనే అనుమానాన్ని కరాటే కళ్యాణి వ్యక్తం చేసింది. అప్పటి వరకే లేని అధికారాన్ని కెప్టెన్ సోహెల్‌కు ఎలా ఇస్తారని ప్రశ్శించింది. టైటిల్ విన్నర్‌ను కూడా మెహబూబ్‌ను చేయమనండి అంటూ అసహనం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X