‘కట్టప్ప’ గుట్టు బట్టబయలు.. అసలు కథ ఇదీ.. బిగ్‌బాస్ ప్లాన్ లీక్!!
మామూలుగా బిగ్‌బాస్ కాన్సెప్ట్ అంతా ఒక్కటే. అయితే మన దగ్గర హిందీ బిగ్‌బాస్ ఎక్కువ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు పద్నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళం ప్రస్తుతం నాల్గో సీజన్లలో ఉంది. తమిళ బిగ్‌బాస్ నాల్గో సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. కన్నడ బిగ్‌బాస్ మనకంటే ముందే ఉన్నాడు. ఇవి కాసేపు పక్కనబెడదాం. మన నాల్గో సీజన్‌లో ప్రస్తుతం ఓ కాన్సెప్ట్ నడుస్తోంది. కట్టప్ప ఎవరంటూ ఇంటి సభ్యులంతా డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేంటో ఓ సారి చూద్దాం.

అవే టాస్కులు..
ఏ భాషకు చెందిన బిగ్‌బాస్ అయినా సరే.. కాన్సెప్ట్ ఒక్కటే. ఓ భాషలో పెట్టిన టాస్క్‌లను మరో భాషలో, మరో సీజన్‌లో వాడేస్తుంటారు. అవే టాస్కులను తిప్పి తిప్పి ప్రయోగిస్తుంటారు. ఎక్కువగా హిందీ బిగ్‌బాస్ టాస్కులే మిగతా వాటిలో పునరావృతం అవుతుంటాయి. అలాగే మన ఈ నాల్గో సీజన్‌లోనూ అదే కాన్సెప్ట్ ఒకటి రిపీట్ అవుతోంది.

కట్టప్ప అంటూ టెన్షన్..
బిగ్‌బాస్ దృష్టిలో కట్టప్ప అంటే కేవలం వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ అని అనుకుంటన్నాడేమో. అదే అభిప్రాయం ఇంటి సభ్యుల్లోనూ కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో మీ అందరి మధ్యే ఓ కట్టప్ప ఉన్నాడు అంటూ ఓ బాంబ్ పేల్చాడు. దీనిపై ఓ టాస్క్ కూడా ఇచ్చాడు.

కట్టప్ప కోసం టాస్క్..
కట్టప్ప ఉన్నాడని చెప్పి ఇంటి సభ్యుల్లో ఓ రకమైన అనుమానం, ఆందోళన, ఆలోచన కలిగించాడు బిగ్‌బాస్. ఇక మీ దృష్టిలో కట్టప్ప ఎవరై ఉంటారో ఊహించి ఓ పేరు చెప్పమని టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులందరి మెజార్టీ అభిప్రాయం ప్రకారం అఖిల్ సర్తాక్ కట్టప్ప అని తెలుస్తోంది. అయితే నిజానికి కట్టప్ప అనే కాన్సెప్టే ఫేక్.
Recommended Video

కన్నడ ఏడో సీజన్‌లో అలా..
కన్నడ బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో ఇలానే కాపుచుకే అనే కాన్సెప్ట్‌ను పెట్టారట. సీజన్ మొత్తంలో ఎప్పుడూ కూడా అదెవ్వరో బయటకు చెప్పలేదట. ఫినాలె సమయంలోనూ అది ఎవరనే విషయం రివీల్ చేయలేదంటా. అంటే హౌస్‌మేట్స్ మధ్య తెలియని భయాన్ని, అనుమానాన్ని క్రియేట్ చేయడమే ఈ కట్టప్ప కాన్సెప్ట్. మొత్తానికి ఇలా ఓ భాషలో ఓ సీజన్‌లో వచ్చిన కాన్సెప్ట్‌లను మళ్లీ వాడితే ఇలా పసిగట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











