కుమార్ సాయికి అన్యాయం చేసిన బిగ్ బాస్.. ఎంత కుట్ర దాగుందో చెప్పేశాడు!
బిగ్ బాస్ నాల్గో సీజన్ ఎప్పుడో అభాసుపాలైంది. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనే జనాలు పెదివి విరిచారు. సరే వచ్చిన కంటెస్టెంట్లు ఏదైనా గొప్పగా చేస్తున్నారా? అంటే అది లేదు. గత సీజన్లను బాగా చూసేసి సేఫ్ గేమ్ ఆడుతూ నెట్టుకొస్తున్నారు. అసలే షో గాడిలో పడటం లేదని అందరూ కామెంట్లు చేస్తుంటే.. నిజాయితిగా ఆడే వారిని కావాలనే ఎలిమినేట్ చేసేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. కొందరిని సేవ్ చేయడానికి ఇంకొందరిని బలి చేస్తున్నారని అంటున్నారు. జనాల ఓట్లను బట్టి ఎలిమినేషన్ జరగడం లేదని టాక్ వస్తోంది.

దేవీ నాగవల్లి, కుమార్ సాయి విషయంలో..
మూడో వారం ఎలిమినేషన్ ఆరో వారం ఎలిమినేషన్ విషయంలో జనాలకు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడో వారంలో దేవీ నాగవల్లి ఎలిమినేషన్ అనూహ్యం, అన్యాయమని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆమె కంటే మెహబూబ్ మరీ తక్కువ స్థాయిలో ఉన్నా కూడా దేవీని ఎలా ఎలిమినేట్ చేస్తారని మండిపడ్డారు. ఇక ఆరోవారం నామినేషన్‌లోనూ అలాంటి పరిస్థితే వచ్చింది.

మోనాల్,అరియానాలో..
కుమార్ సాయి కంటే మోనాల్ అరియానాలో ఓట్లలో తక్కువ స్థానంలో ఉన్నా కూడా వారినే సేవ్ చేశారనే టాక్ బయటకు వచ్చింది. మోనాల్ ఎలిమినేట్ అయిపోయిందనే లీకులు బయటకు రావడం ఆపై మరి కాసేపటికి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే కొందరు మాత్రం కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్‌లో యాక్టివ్‌గా ఉండటం లేదు అందుకే పంపించారని అంటున్నారు.

తాజాగా వివరణ..
తాను ఇంట్లో యాక్టివ్‌గా ఉండలేదు అని వస్తోన్న కామెంట్లకు కుమార్ సాయి స్పందించాడు. తాను చేసిన స్కిట్స్, ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కూడా ప్రసారం చేయలేదని చెప్పాడు. తాను ఎన్నో సందర్భాల్లో ఇంటి సభ్యులందర్నీ నవ్వించానని, టాస్కులో బెస్ట్ పర్ఫామెన్స్ అని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పారు కానీ అవి ప్రసారం చేయలేదని అసలు విషయం చెప్పాడు కుమార్ సాయి.
Recommended Video

మార్నింగ్ మస్తీలో అలా..
తాను మార్నింగ్ మస్తీలో చార్లీ చాప్లీన్‌లా నటించి అందర్నీ నవ్వించాను. అందరూ పగలబడి నవ్వారు కూడా. ఫోటోలు చూపించి ఇంటి సభ్యుల గురించి మాట్లాడే సందర్భంగా చాలా బాగా మాట్లాడాను కానీ అది కూడా వేయలేదు. లేడీస్ పార్టీ టాస్క్‌లోనూ అందర్నీ ఎంటర్టైన్ చేశాను అది కూడా వేయలేదంటూ తనను బిగ్ బాస్ టీం ఎలా దూరం పెట్టిందో చెప్పుకొచ్చాడు. అయితే ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేశారా? లేదా అన్నది తెలియాలి. ఉద్దేశ్యం పూర్వకంగా అని తేలితే ఇది మాత్రం పెద్ద కుట్రే అవుతుంది.


Click it and Unblock the Notifications











