Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఈ జోష్ అప్పుడే చూపిస్తే కథ వేరేలా ఉండేది.. అఖిల్, హారికలపై కుమార్ సాయి కౌంటర్ అదుర్స్
బిగ్ బాస్ షో మొత్తానికి ముగిసేందుకు వచ్చింది. నాల్గో సీజన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడున్నది టాప్ 5 కంటెస్టెంట్లు. అభిజిత్ సోహెల్ అరియానా అఖిల్ హారికల జర్నీ వీడియోలు కూడా చూపించడం అయిపోయింది. ఇక నేటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులను తీసుకువస్తున్నారు. రేపు కూడా ఇలానే ఇంటి సభ్యులతో ముచ్చట్ల పెట్టించేలా కనిపిస్తున్నారు.
గతంలో మాదిరి కాకుండా..
ప్రతీ సీజన్ చివర్లోనూ ఇలాంటి ఎపిసోడ్లో పునరావృత్తం అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. బయటి నుంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వడం లేదు. చివరకు పేరెంట్స్‌ను కూడా గ్లాస్ రూంలోనే పెట్టేశారు. ఇప్పుడు మాజీ కంటెస్టెంట్లను కూడా అలాగే తీసుకొచ్చారు.
అందరూ జోష్‌లో..
చివరి రెండు రోజులు ఉండటంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందరినీ గ్లాస్ రూంలోకి ప్రవేశపెట్టించాడు. నోయల్, లాస్య, స్వాతి, కుమార్ సాయి, అవినాష్, సుజాత, గంగవ్వ, దివి, మెహబూబ్ ఇలా అందరూ వచ్చారు. దేవీ నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ వంటివారు మాత్రం కనిపించలేదు. వచ్చిన ప్రతీ ఒక్కరూ ఫుల్ జోష్లోఉన్నాడు.
కుమార్ సాయి వేరే లెవెల్..
అందరిలోనూ కుమార్ సాయి వేరే లెవెల్లో ఉన్నాడు. స్వాతి దీక్షిత్‌తో మాస్ స్టెప్పులు వేశాడు. అంతేకాకుండా హారిక, అఖిల్‌లకు పంచ్‌లు బాగా వేశాడు. ఎప్పుడైనా సరైన కారణాలు చెప్పి నామినేట్ చేశావా? అంటూ హారికను, పులిహోర విషయంల్ అఖిల్‌ను దారుణంగా ఆడుకున్నాడు కుమార్ సాయి.
అప్పుడేమో అలా..
ఇప్పుడు కనిపిస్తున్న జోష్, ఉత్సాహం అప్పుడే చూపించి ఉంటే కుమార్ సాయి టాప్ 5లో ఉండేవాడు. అసలు కుమార్ సాయి ఎలిమినేషన్ కూడా సరైంది కాదని అందరూ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఓ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ముందుగానే ఎలిమినేట్ అయపోయాడని కుమార్ సాయి విషయంలో అందరూ అభిప్రాయపడ్డారు. ఒక వేళ టాప్ 5 వరకు ఉండుంటే కథ వేరేలానే ఉండేది.