Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పులిహోర, కరివేపాకు..అఖిల్‌కు ఇచ్చి పడేశాడు.. కుమార్ సాయి మామూలోడు కాదు!!
బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల హవా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో మోనాల్, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, లాస్య, కరాటే కళ్యాణి వంటి వారంతా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ అందరిలో కుమార్ సాయి వేరే లెవెల్లో ఎంటర్టైన్ చేశాడు. ఇన్నాళ్లు తన మనసులో ఉన్నవన్నీ బయట పెట్టేసినట్టు కనిపించింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో అఖిల్ ఇచ్చిన పంచ్‌కు ఇలా కసి తీర్చుకున్నట్టు అనిపించింది.
స్వాతి దీక్షిత్‌తో కలిసి..
కుమార్ సాయి స్వాతి దీక్షిత్ కలిసి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే ఓ డ్రామా క్రియేట్ చేశారు. లవర్స్‌లా యాక్ట్ చేస్తూ ఇంట్లో ఉన్న వారి గురించి, వారికి బయట ఉన్న క్రేజ్ గురించి హింట్ ఇచ్చారు. అభిజిత్, హారికల బంధం గురించి, అరియానా డేరింగ్ గురించి బయట ఎలా ఉందో చెప్పేశారు. అవి వారికి అర్థమయ్యాయో లేవో కానీ జనాలకు మాత్రం అర్థమైంది.
ఇక అఖిల్ గురించి..
అఖిల్ గురించి కుమార్ సాయి చెబుతూ.. నీను నీకు కామన్ పాయింట్ ఒకటి ఉంది.. నీకు నాకు పులిహెర అంటే ఇష్టమంటూ అఖిల్ ఫ్లర్టింగ్ గురించి చెప్పేశాడు. నీకు నాకు మరో కామన్ పాయింట్ ఉంది.. నీకు కరివేపాకు నచ్చదు అంటూ మళ్లీ నాటి సంగతులు గుర్తు చేశాడు. అయితే బయట అఖిల్‌ను అదే పేరుతో ట్రోల్ చేస్తారని తెలియదు.
ఎంపైర్ అంటూ హింట్..
ఇక అభిజిత్ క్రేజ్ గురించి కుమార్ సాయి హింట్ ఇచ్చాడు. ఎక్కడైనా క్రికెట్ ఆడితే.. కెప్టెన్‌కు, ఆటగాళ్లకు పేరు వస్తుంది.. కానీ ఎంపైర్‌కు వస్తుందా? అని అభిజిత్ గురించి చెప్పాడు. సంచాలక్‌గా చేసి కూడా ఫుల్ ఫేమస్ అయ్యావ్ అంటూ బయట క్రేజ్ అలా వచ్చిందంటూ పరోక్షంగా చెప్పేశాడు.
పేరు మరిచిపోయి..
టాప్ 5లోకి రావడం అంత ఈజీ కాదని, బయట మీ ఫాలోయింగ్ మామూలుగా లేదని, ఇలా మిమ్మల్ని చూస్తుంటే మామూలుగా లేదని, పెద్ద సెలెబ్రిటీలను చూస్తున్నట్టు అనిపిస్తోందంటూ అందరి పేర్లు చెప్పాడు. కానీ అఖిల్ పేరును మరిచిపోయాడు. పక్కనే ఉన్న స్వాతి, సోహెల్ గుర్తు చేయడంతో అఖిల్ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కుమార్ సాయి నిన్నటి ఎపిసోడ్‌ను రఫ్ఫాడించాడు.