నాన్న కోసం అప్పులు.. అల్లుడే కొడుకులా అయ్యాడు.. లాస్య ఎమోషనల్

బిగ్ బాస్ షో ఓపెనింగ్ సెరమెనీలోనే లాస్య తన జీవిత కథను చెప్పేసింది. తన జీవితంలో రెండు సార్లు పెళ్లి అయిందని, అది కూడా తన భర్తనే మళ్లీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాని తెలిపింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్ని కష్టాలు పడిందో, వాటిని ఎలా భరించి, ఇంట్లో వాళ్లను ఒప్పించిందో లాస్య చెప్పుకొచ్చింది. మొదట రిజిష్టర్ మ్యారేజ్ అయినా రెండో సారి పెద్దలందరూ కలిసి సంప్రదాయబద్దంగా వివాహం చేయించారని తెలిపింది.

బయటకు వచ్చేసి..

బయటకు వచ్చేసి..

మూడు తప్పులు చేసినందుకు మూడు ఏళ్లు నాన్న నాతో మాట్లాడలేదు. చెప్పిన మాట విననందుకు సారీ నాన్న. నీకు ఇచ్చిన మాట ప్రకారమే ఆయన గురించి ఎక్కడా చెప్పలేదు నేను. మళ్లీ మమ్మల్ని అర్థం చేసుకుని మాకు మళ్లీ పెళ్లి చేసినందుకు థ్యాంక్స్ నాన్న అని లాస్య చెప్పుకొచ్చింది.

యాక్సిడెంట్ అవ్వడంతో..

యాక్సిడెంట్ అవ్వడంతో..

మా నాన్నకు ఓసారి యాక్సిడెంట్ అయింది. మా ఊరికి రావాలి అంటే కొండల్లోంచి రావాలి. అలా ఓ సారి వస్తుంటే నాన్నకు ప్రమాదం జరిగింది. మొహం అంతా చితికిపోయింది. మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేస్తే గానీ మా నాన్న అని గుర్తు పట్టలేకపోయాం. అప్పుడు హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బుల్లేవని ధీనస్థితి గురించి లాస్య చెప్పింది.

అందరి దగ్గర అప్పు..

అందరి దగ్గర అప్పు..

అలా అందరి దగ్గర అప్పు తీసుకున్నాను. దగ్గరి వాళ్లు ఎవ్వరూ కూడా అప్పు ఇవ్వలేదు. ఒక్కొక్కరి దగ్గర ఐదు వేలు అలా తీసుకుని దాదాపు 15 ఇరవై మంది దగ్గర అప్పు తీసుకున్నాను. అలా మొత్తం లక్షా యాభై వేలు తీసుకున్నాను. ఆ సమయంలో మా ఆయన ముందుకు వచ్చారు. ఇక మా ఆయన్ను అల్లుడిగా కాదు కొడుకుగా చూసుకుంటారు అని లాస్య ఎమోషనల్ అయింది.

Recommended Video

Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
కజిన్ అని చెప్పేదాన్ని..

కజిన్ అని చెప్పేదాన్ని..

భర్తను తలుచుకుంటూ లాస్య ఎమోషనల్ అవుతూ క్షమాపణలు చెప్పింది. ఏడేళ్లు ఎవ్వరికీ కూడా భర్త అని చెప్పలేదని ఐడెంటిటి ఇవ్వనందుకు క్షమించమని అడిగింది. షూటింగ్‌లకు బైకు మీద దింపినప్పుడు కూడా ఎవరైనా అడిగితే కజిన్ అని చెప్పే దాన్ని. ఎప్పుడూ కూడా భర్త్ అని బయటకు చెప్పలేదు, నాన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అంటూ లాస్య ఏడ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X