నా భర్త మిడిల్ క్లాస్ కూడా కాదు, పెళ్లి తరువాత అసలు విషయం తెలిసింది: లాస్య

బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పటికప్పుడు వాతావరణం చాలానే చేంజ్ అవుతోంది. కంటెస్టెంట్స్ ఒకరోజు సీరియస్ గా ఉంటే మరొక రోజు సరదాగా నవ్విస్తున్నారు. ఇక ఎమోషనల్ సీన్లకు కొదవ లేదు. అప్పుడప్పుడు పర్సనల్ విషయాలను బయటకు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆడియెన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను బిగ్ బాస్ హౌజ్ లో వివరిస్తున్నారు. ఇక లాస్య కూడా ఒక సీక్రెట్ చెప్పింది.

ఎక్కువగా తెలిసిన ఏకైక కంటెస్టెంట్ లాస్య

ఎక్కువగా తెలిసిన ఏకైక కంటెస్టెంట్ లాస్య

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు నార్మల్ గా టీవీ ఆడియెన్స్ కి ఎక్కువగా తెలిసిన ఏకైక కంటెస్టెంట్ లాస్య మాత్రమే. మిగతా వాళ్ళు కొందరు సీనియర్ సెలబ్రెటీలు అయినప్పటికీ అప్పట్లో యాంకరింగ్ వలన లాస్య టీవీ ఆడియెన్స్ కి చాలా దగ్గరైంది. ఇక ఆమె కోసం కూడా బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.

భర్త గురించి సీక్రెట్ చెప్పిన లాస్య

భర్త గురించి సీక్రెట్ చెప్పిన లాస్య

ఇక గురువారం ఎపిసోడ్ లో లాస్య తన భర్త గురించి ఎవరికి తెలియని విషయాలని బయటపెట్టింది. మీ జీవితాల్లో ఎవరికి తెలియని సీక్రెట్స్ ని బయటకు చెప్పాలని బిగ్ బాస్ అడగడంతో లాస్య తన మ్యారేజ్ లైఫ్ గురించి ఎమోషనల్ గా వివరించింది. తన భర్త వయసులో తనకంటే చాలా చిన్న వాడని ఫైనాన్షియల్ గా కూడా అతను అంతగా ఉన్నవాడు కూడా కాదని తెలిపింది.

కనీసం మిడిల్ క్లాస్ కాదు

కనీసం మిడిల్ క్లాస్ కాదు

లాస్య మాట్లాడుతూ.. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. మరాఠీ అబ్బాయిని పెళ్లి చెసుకున్నాను. అప్పుడు చాలా మంది అతను డబ్బున్నవాడు కోటీశ్వరుడు అనుకున్నారు. కమి అతను కనీసం మిడిల్ క్లాస్ కాదు. వయసులో నా కంటే చిన్నవాడు అని తరువాత తెలిసింది. ఆ విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మా ఇంట్లో వాళ్లకు కూడా ఆ విషయం పెద్దగా తెలియదని చెప్పింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
చివరలో మరింత ఎమోషనల్ గా..

చివరలో మరింత ఎమోషనల్ గా..

నిజంగా నేను ఈ షోలోకి వచ్చిన తరువాత ఓపెన్ గా మాట్లాడుతున్నాను షాకుల మీద షాక్ లు ఇస్తున్నానని చెప్పిన లాస్య చివరలో గుండె బరువయ్యేలా మరో ఎమోషనల్ కామెంట్ చేసింది. అమ్మా నీ అల్లుడు వయసులో నా కంటే ఏడాది చిన్నవాడు కావచ్చు. కానీ పెద్ద మనసున్న వాడు.. చాలా బాగా చూసుకుంటాడని లాస్య తన జీవితంలోని ఎవరికి తెలియని సీక్రెట్ ని బయటకు చెప్పి అందరిని ఎట్రాక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X