ఆఖరికి నాగార్జున కూడా ఆంటీ అనేశారు.. ఒక్కసారిగా ఎగబడిన లాస్య
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొత్తానికి ఒక ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది గాని మళ్ళీ వీకెండ్ ముగిసేసరికి ట్రాక్ తప్పుతున్నట్లు అనిపిస్తోంది. ఏదేమైనా శని, ఆదివారాల్లో నాగ్ మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ మధ్య కంటెస్టెంట్స్ అసలైన ఫైట్ మొదలైనట్లు అర్ధమవుతోంది. అవసరమైన టైమ్ లో ఎలా ఉండాలి.. ఎలిమినేషన్ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు నాగార్జున, కంటెస్టెంట్స్ మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని సరదా సన్నివేశాలు ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి.

లస్యను ఆంటీ అనేసిసిన నాగార్జున
ఇక శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ ఫస్ట్ హాఫ్ సరదాగా మాటలతో మొదలయ్యి ఇంటర్వెల్ బ్యాంగ్ లో అఖిల్ తో ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్విస్టులను పక్కన పెడితే ముందుగా నాగార్జున.. సోహైల్, లాస్య మధ్య చోటు చేసుకున్న ఒక సరదా సన్నివేశంను గుర్తు చేస్తూ.. లస్యను ఆంటీ ఆంటీ అంటూ ఆట పట్టించారు. మధ్యలో కంటెస్టెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినా ఎక్కువగా లస్యను ఆంటీ అనేశారు నాగార్జున.

కాదు కాదు అంటూ..ఎగబడిన లాస్య
నాగార్జునతో పాటు అందరూ ఆంటీ ఆంటీ అంటుంటే లాస్య కాదు కాదు అంటూ ఎగబడింది. మొన్న మెహబూబ్ ని సోహైల్ ఈ విధంగా అన్నాడు. అరేయ్ లాస్య అక్క పిలుస్తోంది రా అంటూ కామెంట్ చేస్తూనే.. బిగ్ బాస్ లో ఒక ఆంటీ అని అనేశాడు. దీంతో లాస్య ఒక్క సెకన్ షాక్ అయ్యింది. నేను ఆంటీ ఏంటి అని వాదనకు దిగింది. అనంతరం సోహైల్ నువ్వే అన్నావ్ కదా నిన్న అంటూ గుర్తు చేయడంతో నాకు నేను ఎప్పుడైనా అనుకోవచ్చు కానీ నువ్వు అనకూడదు అంటూ మరో కౌంటర్ ఇచ్చింది లాస్య. అదే విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు.

ఫోకస్ అవ్వాలని కంటెస్టెంట్స్ కూడా..
ఇక వారి మధ్య జరుగుతున్న సరదా సన్నివేశంలో అవినాష్ ఫోకస్ అవ్వాలని అనుకున్నారో ఏమో గాని మధ్యలోకి వచ్చేశారు. సోహైల్ ని అంకుల్ అంటూ పరువు తీసే ప్రయత్నం చేశారు గాని అంతగా ఆ జోక్ పేలలేదు. కంటెస్టెంట్స్ మధ్యలో ఇక ఆ గోడవ కాస్త ఎక్కువవుతోందని అనుకున్న తరుణంలో నాగార్జున ఎండ్ కార్డ్ పెట్టేశారు
Recommended Video

వారిద్దరి మధ్య అలాంటి సీన్..
నువ్వు నన్ను ఆంటీ అంటే యాంటీ అయిపోతా చూడు మరి అంటూ మొన్ననే లాస్య కౌంటర్ ఇచ్చింది. అప్పుడే సోహైల్ దెబ్బకు సైలెంట్ అయ్యాడు. ఎందుకంటే సోహైల్, లస్యతో గోరింటాకు రేంజ్ లో సిస్టర్ సెంటిమెంటును క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి చివరికి ఆ సరదా సీన్ లో డ్రాప్ అవ్వగా తప్పలేదు. కానీ బిగ్ బాస్ లో ఎమోషన్స్ కి తావుండదని నిన్న అఖిల్ చేసిన రచ్చతో అర్ధమయ్యింది. దీంతో ఎప్పుడో ఒకసారి సోహైల్, లాస్య మధ్య కూడా అలాంటి సీన్ కూడా క్రియేట్ కావచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











