కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా బిగ్ బాస్ హౌజ్.. పులి(అభి) వేట మొదలైంది!

బిగ్ బాస్ హౌజ్ లో వీకెండ్ మొదట్లో ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నామినేషన్స్ మొదలయ్యాయి అంటే చాలు కంటెస్టెంట్స్ ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు. ఇక నేటి నుంచి టాస్కులలో కంటెస్టెంట్స్ వారి సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. బిగ్ బాస్ హౌజ్ ని కమాండో ఇన్‌స్టిట్యూట్‌ గా మార్చగా కంటెస్టెంట్స్ ట్రైనింగ్ లో వారి కష్టాన్ని చూపించబోతున్నారు. ఇక వారి సొంత టాలెంట్ ని ఎలా బయటపెడతారో ఈ రోజు షోలో తెలిసిపోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా షోపై అంచనాల డోస్ ని పెంచుతోంది.

డోస్ పెంచిన అభిజిత్

డోస్ పెంచిన అభిజిత్

బిగ్ బాస్ హౌజ్ లో గత టాస్కులతో ఎక్కువగా అరియానా, అవినాష్ డామినేట్ చేసినట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. మధ్యలో మెహబూబ్ కూడా జాలి దయ లేకుండా ఫిజికల్ టాస్కులతో చాలా తెలివిగా ఆడాడు. ఇక ప్రతిసారీ ఫిజికల్ టాస్కులతో నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్న అభిజిత్ ఈ సారి డోస్ పెంచినట్లు అర్ధమవుతోంది.

పులిలా కష్టపడుతున్న అభి

పులిలా కష్టపడుతున్న అభి

ఈ వారం అభిజిత్ ని నలుగురు నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మోనాల్ వెళ్లిపోతుందనే రూమర్స్ వస్తున్నప్పటికీ బిగ్ బాస్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. ఇక అభిజిత్ ని నామినేట్ చేయడానికి అసలు కారణం అతను టాస్కులతో పెద్దగా కష్టపడడు అని. అయితే నెగిటివ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే విధంగా అభి పులిలా కష్టపడినట్లు అర్ధమవుతోంది.

కంటెస్టెంట్స్ పోటాపోటీగా..

కంటెస్టెంట్స్ పోటాపోటీగా..

నాగార్జున అభిని పులి అనే ట్యాగ్ తో హైలెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కమాండో ఇన్‌స్టిట్యూట్‌ లో అభి పరిగెత్తే విధానం చూసి అతని ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ఎప్పుడు చేయని ఫీట్స్ చేస్తూ చాలా కష్టపడుతున్నట్లు అర్ధమవుతోంది. ఉరుకులు పరుగులతో పాటు ఫైరింగ్ మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ ఎక్కడివారెక్కడ దాక్కున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
ఇక్కడ కూడా అవినాష్ కామెడీగా..

ఇక్కడ కూడా అవినాష్ కామెడీగా..

ఇక అవినాష్ ఈ ఎపిసోడ్ లో కామెడిగా సెల్యూట్ చేయడం హైలెట్ అయ్యేలా ఉంది. నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేసిన బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి మరి. ఇక సోహెల్ కూడా స్వమ్మింగ్ పూల్ లో దూకి అభిజిత్ తో పోటీ పడి టాస్కులను పూర్తి చేస్తున్నాడు. అతనికి అఖిల్ కూడా మద్దతు ఇస్తున్నాడు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా పోటీ పడుతున్నట్లు అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X