బిగ్ బాస్ 4: ఈ సారి వాళ్ళ టార్గెట్ అరియానా.. పగతో కొట్టేస్తున్నారు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గత రెండు వారాల నుంచి కొంచెంకొంచెంగా తన రేటింగ్ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఒక్కసారిగా టాస్కులతో వివాదాల డోస్ పెంచి సోమవారం రోజు అసలు రంగులు బయటపడేలా చేస్తున్నారు. ఇక గత వారం అమ్మా రాజశేఖర్ ని టార్గెట్ చేసినట్లుగానే ఈ సారి అరియానను కూడా కొందరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

బాటిల్స్ తో తలపై కొట్టి
10వ వారం నామినేషన్లు మొదలు అయ్యేది ఈ రోజే. షోకి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేసింది స్టార్ మా. ఇక నామినేషన్ ప్రక్రియను ప్రతిసారి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసే బిగ్ బాస్ ఈ సారి అంతకు మించి అనేలా ట్రై చేశారు. ఏకంగా బాటిల్స్ తో నెత్తిపై కొట్టి నామినేట్ చేయాలని చెప్పడంతో కంటెస్టెంట్స్ మద్య కోపాలు మరింత ఎక్కువవుతున్నాయి.

నా యాటిట్యూడ్ నా ఇష్టం
ఇక ప్రోమో చూసిన తరువాత కామన్ గా ఎక్కువ మంది టార్గెట్ అరియానా అని అర్ధమయ్యింది. హారికతో కూడా గోడవపడిన అరియానా నేను మాట్లాడిన తరువాత మాట్లాడు అంటూ కౌంటర్ ఇవ్వగా.. హారిక కూడా అదే రేంజ్ లో ఇచ్చింది. అలాగే నా యాటిట్యూడ్ నా ఇష్టం అంటే మన కథ వేరే ఉంటది అంటూ అరియానాకు వార్నింగ్ ఇచ్చాడు సోహైల్.

ఆఖరికి మోనాల్ కూడా..
ఆఖరికి మోనాల్ కూడా అరియానాపై కోపం తెచ్చుకుంది. మోనాల్ ని ఫేక్ అంటూ నామినేట్ చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం తెచ్చుకుంది. నా మీద కావాలని కామెంట్స్ చేస్తారు. నా పెయిన్ ఏంటో నీకు ఏం తెలుసు అంటూ మోనాల్, అరియానాపై గట్టిగా అరిచేసింది. ఇక ఎంత అరిచినా కూడా అరియానా మాత్రం తగ్గేలా లేదని అర్ధమయ్యింది.
Recommended Video
ఆ నలుగురి టార్గెట్.. అరియానా
ఇక మిగతా వాళ్ళ నామినేషన్స్ పై పెద్దగా ఎట్రాక్ట్ అనిపించలేదు గాని నలుగురు అరియానాను నామినేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మెహబూబ్, సోహైల్, హారిక, మోనాల్ నలుగురు కూడా అరియానా తలపై బాటిల్ పగలగొట్టడంతో ఆమె ఈ సారి ఎలిమినేషన్ లో ఉంటుందని చాలా ఈజీగా అర్ధమయ్యింది. అలాగే అభిజిత్, అఖిల్ మధ్యన కూడా గొడవ ఈ రోజు మరింత ఎక్కువయ్యేలా ఉన్నట్లు అనిపించింది.


Click it and Unblock the Notifications











