బిగ్ బాస్ 4 లీక్: ఆ నలుగురు హీరోలకు భారీ ఆఫర్.. రిజెక్ట్ చేసిన ఇద్దరు యువ నటులు!
కరోనా వైరస్ కారణంగా తెలుగు బిగ్ బాస్ 4వ సీజన్ కూడా ఆలస్యంగా స్టార్ట్ కానుంది. అసలైతే ఈ పాటికె రియాలిటీ షో హంగామా ఒక రేంజ్ లో ఉండేది. కానీ రిస్క్ చేయడం ఎందుకని షో నిర్వహకులు నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఇక నెక్స్ట్ సిజన్ కోసం కంటెస్టెంట్ లిస్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. దాదాపు ఒక 40మందితో కూడిన లిస్ట్ తయారు చేసిన బిగ్ బాస్ టీమ్ మరికొన్ని రోజుల్లో అందులో హౌజ్ కి వెళ్లబోయే వారిని ఫైనల్ చేయనుందట. ఇక ఈ క్రమంలో నలుగురు హీరోలను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది.

సీరియస్ గా ఆలోచిస్తున్నారు..
దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు అన్ని భాషల్లో రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా కాస్త బ్రేక్ పడటంతో నెక్స్ట్ సీజన్ ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై సీరియస్ గా ఆలోచిస్తూన్న నిర్వాహకులు వీలైనంత త్వరగా షోను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎలాంటి మార్పులు ఉండవు..కానీ
తెలుగులో నాలుగవ సీజన్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున మొదటి మూడు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. నెక్స్ట్ కూడా మళ్ళీ నాగార్జున హోస్ట్ గా రాబోతున్నట్లు టాక్ వస్తోంది. హోస్ట్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని రూమర్స్ వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు నమ్మలేము.

నలుగురు యువ హీరోలు?
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల నలుగురు యువ హీరోలకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. Rx100 ఫేమ్ కార్తికేయతో పాటు గుంటూరు టాకీస్ యాక్టర్ సిద్దు జొన్నలగడ్డని కూడా సంప్రదించారట. అయితే వారిద్దరు నో చెప్పినట్లు టాక్ వస్తోంది. ఇక మరో ఇద్దరు యువ నటులు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.
Recommended Video

ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్..
లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ ఫేమ్ సుధాకర్, గరుడ వేగా ఫేమ్ అదితి అరుణ్ కి బిగ్ బాస్ 4లో ఆఫర్ రాగా వీరు పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ఫేమ్ కోసం ప్రయత్నం చేస్తున్న ఈ యువ నటులు బిగ్ బాస్ కి వెళితే డబ్బుతో పాటు క్రేజ్ కూడా వస్తుందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











