బిగ్‌బాస్ ఫైనల్ గెస్ట్: ఆ హీరోలను కావాలనే రిజెక్ట్ చేసిన నాగ్.. స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
16 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి 15 వారాల పాటు మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది. మధ్య మధ్యలో రేటింగ్స్ విషయంలో కాస్త తడబడినట్లు అనిపించినప్పటికి మళ్ళీ గోడవలతో ఎలిమినేషన్ ట్విస్టులతో డోస్ పెంచడంతో ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4పై కొన్ని విషయాల్లో అనుమానాలు కూడా చాలానే వచ్చాయి. అయితే గెస్ట్ విషయంలో బిగ్ బాస్ హోస్ట్ గా మొదట చిరంజీవిని అనుకోలేదట. ఫైనల్స్ లో మెగాస్టార్ ఆ విషయంపై కూడా వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

అప్పటి నుంచి లెక్క మారింది..
బిగ్ బాస్ సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ కు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ తోనే అప్పటి ఫైనల్స్ ను పూర్తి చేశారు. ఇక సీజన్ 2కు వచ్చేసరికి లెక్క మారింది. అప్పటి నుంచి కూడా గెస్టుల విషయంలో బిగ్ బాస్ కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తోంది. నాని ఉన్నప్పుడు ఫైనల్స్ కు విక్టరీ వెంకటేష్ గెస్టుగా వచ్చిన విషయం తెలిసిందే..

మంచి ఫన్ క్రియేట్ చేసిన మెగాస్టార్
ఇక నాగార్జున హోస్ట్ గా మూడవ సీజన్ నుంచి కంటిన్యూ అవుతున్నప్పటి నుంచి కూడా గెస్టుల విషయంలో పెద్దగా మార్పులు ఏమి కనిపించడం లేదు. సీజన్ 3 మాదిరిగానే సీజన్ 4కు కూడా మెగాస్టార్ చిరంజీవినే ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఫైనల్ ట్రోఫీని విన్నర్ కు అందించారు. ఫైనల్ లో ఈ సారి మెగాస్టార్ మంచి ఫన్ కూడా క్రియేట్ చేశారు.

ఫస్ట్ మెగాస్టార్ కాదట..
గత ఏడాది కంటే కూడా ఈ సీజన్ ఫైనల్ ను నిర్వాహకులు చాలా చక్కగా ప్లాన్ చేశారనే చెప్పాలి. ఫన్ తో పాటు ఎమోషన్ అలాగే ఎంతో ఉత్కంఠను కూడా క్రియేట్ చేసి విన్నర్ ను ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సీజన్ 4కు ప్రత్యేక గెస్ట్ ఎవరనే విషయంలో. మొదట మెగాస్టార్ ను అనుకోలేదట. నాగార్జునకు చెప్పకుండా ముందే ఇతర హీరోలను సంప్రదించారట.

ఆయన మాటను కాదనలేకపోయారట
నిర్వాహకులు వేరే హోరోల లిస్టును ఫిక్స్ చేసి ఎవరో ఒకరిని రప్పించాలని నాగార్జున ముందు లిస్టు ఉంచగా నాగ్ వారికి దిమ్మ తిరిగెలా షాక్ ఇచ్చాడని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని మరోసారి గెస్టుగా రప్పించాలని చెప్పడంతో ఆయన మాటను కాదనలేకపోయారట.

స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
బిగ్ బాస్ ఫైనల్ లో కూడా మెగాస్టార్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది కూడా నేనే గెస్ట్ గా వచ్చాను. అయితే ఈ సారి మళ్ళీ ఆహ్వానిస్తారని ఊహించలేదు. ఇతర హీరోలను ఎవరినో పిలిపిస్తున్నారని తెలిసింది. అయితే వారిని ఎవరు వద్దని నాగ్ పట్టుబట్టి నన్ను ఇక్కడికి రప్పించాడని చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు.
Recommended Video

నాగ్ రిజెక్ట్ చేసింది ఆ హీరోలనే.. ?
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ గెస్ట్ ఎవరనే విషయంలో గత కొన్ని వారాలుగా నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక అందులో మొదట మహేష్ బాబు, ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. చిరంజీవి పేరు కూడా వచ్చింది కానీ ఆయన రకపోవచ్చనే రూమర్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. ఫైనల్స్ కు ఎన్టీఆర్, లేదా మహేష్ రవాల్సిందట కానీ నాగ్ ఆ పేర్లను రిజెక్ట్ చేసి చిరంజీవిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











