కండలు ఉంటే సరిపోదు బ్రెయిన్ ఉండాలి.. కామెడీ పీస్ అంటూ మెహబూబ్‌‌ను ఆడుకుంటున్న నెటిజన్స్!!

బిగ్‌బాస్‌ షోలో ఒక్కొక్కరి జాతకం, రంగులు బయటపడాలంటే ఒక్క చిన్న విషయం చాలు. మరీ ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో అసలు రంగు బయటపడుతోంది. వీరావేశంలో ఒక్కొక్కర మాటలు తూలడం, రెచ్చిపోవడం వంటివి చేస్తుంటారు. ఫ్రస్ట్రేషన్‌లో కంట్రోలో కోల్పోయి పిచ్చిపట్టిన వారి మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అందుకే బిగ్ బాస్ ప్రేమికులు ఎక్కువగా ఫిజికల్ టాస్కులు ఇవ్వాలని కోరుకుంటారు. నాల్గో సీజన్‌లో ఇచ్చిన ఉక్కు హృదయం అనే ఈ మొదటి టాస్కే ఓ రేంజ్‌లో వర్కౌట్ అయింది.

టాస్క్ ఏంటంటే..

టాస్క్ ఏంటంటే..

ఉక్కు హృదయం అనే ఈ టాస్క్‌లో రోబోల టీంలో అభిజీత్, కుమార్ సాయి, ఆరియానా, హారిక, దేవీ నాగవల్లి, గంగవ్వ, అవినాష్‌లు ఉంటారు. మిగతా వారంతా మనుషుల టీంలో ఉన్నారు. సిల్వర్ బంతిని పగలగొడితే ఒక రోబో చనిపోతుంది.. చివరి వరకు ఒక్క రోబో అయినా మిగిలినా మనుషుల టీం ఓడిపోతుంది. రోబోలకు అవసరమైన చార్జింగ్ మనుషులు అధీనంలో.. మనుషులకు అవసరమైన తిండి, బాత్రూం వంటివి రోబోలో చేతిలో ఉంటాయని మెలిక పెట్టాడు. ఇలా పరస్పరం ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని తెలిపాడు.

పంతంతో ప్రవర్తించారు..

పంతంతో ప్రవర్తించారు..

ఇచ్చి పుచ్చుకోవాలని బిగ్‌బాస్ చెప్పినా సరిగ్గా బేరాలు కుదర్లేదు. రోబోలకు కావాల్సిన చార్జింగ్ దొరకలేదు. మనుషులు తిండి తిప్పలు లేకపోయినా పర్లేదు అంటూ భీష్మించుకుని కూర్చున్నారు. అసలే ఓ రోబో చనిపోయిందన్న ఫ్రస్ట్రేషన్, చార్జింగ్ ఇవ్వడం లేదన్న బాధలో రోబోల టీంకు ఓ ఆలోచన వచ్చింది. మనుషుల టీంలో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయాలనే అభిజీత్ ఐడియా ఇచ్చాడు.

పక్కా ప్లాన్..

పక్కా ప్లాన్..

ఇక మనుషుల టీంలోని సభ్యులకు ఎర వేసేందుకు అభిజీత్ ముందుకు వచ్చాడు. అందరూ పడుకుని ఉండగా.. అఖిల్-మోనాల్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. వారి దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశాడు. చివరకు ఎలాగోలా నమ్మించి దివిని లోపలకు వచ్చేలా చేశారు. ఆమెను గట్టిగా పట్టుకుని చార్జింగ్ పెట్టుకున్నారు. అభిజీత్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది.

మెహబూబ్, సోహెల్, అఖిల్ ఫైర్

మెహబూబ్, సోహెల్, అఖిల్ ఫైర్

దివిని కిడ్నాప్ చేసి చార్జింగ్ పెట్టుకోవడంపై మనుషుల టీం సభ్యులు రెచ్చిపోయారు. మోహబూబ్, సోహెల్ అదుపుతప్పి ప్రవర్తించారు మరీ ముఖ్యంగా మెహబూబ్ భారీగానే మాటలు తూలాడు. అంతలా సీరియస్‌గా రియాక్ట్ అయితే నెటిజన్లు మాత్రం కామెడీ పీస్‌ను చేసేశారు.

ఎలిమినేట్ అయ్యేది..

ఎలిమినేట్ అయ్యేది..

దమ్ముంటే నన్ను తీసుకెళ్లండిరా ఆడవాళ్లతో ఏంటిరా అంటూ వీరావేశంగా ఊగిపోయిన మెహబూబ్‌పై మీమ్స్, ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. కండలు పెంచాడు కానీ బుర్ర పెంచలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఇతడే అంటూ నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X