వంద శాతం ఆడుతావ్.. కానీ నాకు అది వద్దు.. అభిజిత్‌పై మెహబూబ్‌ కామెంట్స్

బిగ్ బాస్ షోలో విజయవంతంగా పది వారాలు గడిచాయి. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మెహబూబ్ ఎలిమినేషన్ ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సోహెల్ అఖిల్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. ఎలిమినేట్ అయ్యానని తెలిసిన క్షణం నుంచి మెహబూబ్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంత ఎమోషనల్‌గా, ఇంత భారంగా సాగిన ఎలిమినేషన్ ఏ సీజన్‌లోనూ లేదు. కిందపడి మరీ ఏడ్చేశారు. అందంతా ఒకెత్తు అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అందరికీ పాజిటివ్‌గా చెప్పాడు.

పదోవారంలో ఎలిమినేషన్..

పదోవారంలో ఎలిమినేషన్..

పదో వారం నామినేషన్స్ ప్రక్రియనే వెరైటీగా. షుగర్ బాటిల్స్ నెత్తి మీద పగలగొట్టి నామినేట్ చేసేశారు. ఇందులో పదోవారానికి గానూ అభిజిత్, హారిక, అరియానా, సోహెల్, మెహబూబ్, మోనాల్ నామినేట్ అయ్యారు. చివరకు అందరూ సేవ్ అయి మెహబూబ్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.

కన్నీటితోనే..

కన్నీటితోనే..


చివరకు సోహెల్, మెహబూబ్‌కే లింకు పెట్టారు. ఇద్దరిలో ఎవరు ఒకరు సేవ్ అవుతారు.. మరొకరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇద్దరిలో ఎవ్వరూ ఎలిమినేట్ అయినా సేవ్ అయినా ఇద్దరికీ బాధే ఉంటుంది అని చెప్పుకొచ్చారు. చివరకు మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించడంతో సోహెల్ ఏడుపు మొదలెట్టాడు.

అభిజిత్‌తో అలా..

అభిజిత్‌తో అలా..

ఇక ఎలిమినేట్ అయ్యాడని తెలిశాక ఇంట్లో సభ్యులందరూ షాక్ అయ్యారు. అంత బలమైన కంటెస్టెంట్ ఎలా ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. నువ్ నా తమ్ముడివి.. ఎప్పటికీ నా తమ్ముడివే.. అంటూ అభిజిత్ కూడా ఎమోషనల్ అయి మెహబూబ్‌ను హత్తుకున్నాడు. ఈ ఇంట్లో నువ్వే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌వి అని మెహబూబ్‌ను ఓదార్చాడు.

వంద శాతం వద్దు..

వంద శాతం వద్దు..

ఇక ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు, స్టేజ్ మీదా అభిజిత్‌కు ఒకే మాటలు చెప్పాడు. నాకు తమ్ముడు ఉన్నాడు.. ఇంట్లో అన్ని నేనే చూసుకుంటా.. కానీ నాకు అన్న ఉన్నాడు.. అభిజిత్ నా అన్న.. అంటూ మెహబూబూ ఎమోషనల్ అయ్యాడు. నువ్ టాస్కులు వంద శాతం ఆడుతావ్.. కానీ నాకు అది వద్దు.. నాకు 200 శాతం కావాలి.. నాకు నువ్ రోజూ జిమ్‌లో కనిపించాలి.. ఫిజికల్ టాస్కులు ఇంకా బాగా ఆడాలని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఆ మాటలుచెప్పాడు.

అభిజిత్ ఎమోషనల్..

అభిజిత్ ఎమోషనల్..

ఎప్పుడూ కూడా నిబ్బరంగా ఉండే అభిజిత్ కూడా మెహబూబ్ పరిస్థితి, చూపించే ప్రేమకు చలించిపోయాడు. నేను పదేళ్ల క్రితం ఎలా ఉండేవాడినో మెహబూబ్ అలా ఉన్నాడు.. చాలా కష్టపడుతుంటాడు.. ఏం జరిగిందో నాకు తెలీదు కానీ.. ఈ ఇంట్లో ఉండేందుకు మెహబూబ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి అదొక్కనే నేను చెప్పగలను అంటూ అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X