దివి మీదకు ఎక్కేసిన మెహబూబ్.. బ్యూటీ విత్ బ్రెయిన్ మాత్రమే కాదంటూ ఫన్నీ కామెంట్
బిగ్ బాస్ షోలో ఏర్పడిన బంధాలు కొన్ని అలాగే కొనసాగుతుంటాయి. ఇంకొన్ని అక్కడే ఆగిపోతుంటాయి. ఇంకొన్ని బంధాలు మరింతగా పెనవేసుకుపోతుంటాయి. అలా బిగ్ బాస్ షో ద్వారా మెహబూబ్, దివి వంటి వారెంతో వెలుగులోకి వచ్చారు. సైడ్ ఆర్టిస్ట్‌గా ఎవ్వరికీ తెలియని దివి నేడు ఎంతో మంది కలల రాణిగా, ఆరాద్య దేవతగా మారింది. ఇక యూట్యూబ్, టిక్ టాక్ వంటి వాటికే పరిమితమైన మెహబూబ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఫేమస్. లోపల ఈ ఇద్దరూ ఎలా ఉన్నా కూడా బయటకు వచ్చాక మాత్రం మంచి స్నేహితుల్లానే ఉంటున్నారు.

అంతా ఒకే గ్యాంగ్..
బిగ్ బాస్ షోలో మొదటగా అమ్మ రాజశేఖర్, దివి, మెహబూబ్ ఇలా అందరూ ఒకే గూటి పక్షుల్లా ఉన్నారు. ఆ తరువాత మెహబూబ్ సోహెల్ ఒకటయ్యారు. అదే సమయంలో అమ్మరాజశేఖర్‌తోనూ మెహబూబ్ గురు శిష్యుల బంధాన్ని కొనసాగించాడు. అయితే అమ్మ రాజశేఖర్ మాత్రం దివి కోసం టాస్కులు ఆడేవాడు.

దివి మెహబూబ్ మధ్య గొడవలు..
దివి మెహబూబ్ మధ్య గొడవలు కూడా అయ్యాయి. నామినేషన్ విషయంలో ఈ ఇద్దరూ గొడవలు పెట్టుకున్నారు. ఎప్పుడూ నామినేట్ చేయను అని మాటిచ్చిన దివి మాట తప్పిందని మెహబూబ్ పాయింట్ అవుట్ చేశాడు. కాయిన్ టాస్క్‌లో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా బిగ్ బాస్ ఇంటి వరకే పరిమితం.

బయటకు వచ్చాక..
బయటకు వచ్చాక మెహబూబ్ దివితో బాగానే కలిసిపోయినట్టున్నాడు. ఇంట్లో మంచి మనుషులు కొంటె రాక్షసులు అనే టాస్క్‌లో మెహబూబ్‌ను దివి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. అలా అమాంతం మెహబూబ్‌ను ఎత్తుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతకు ముందు కొన్ని వారాల క్రితం దివిని మెహబూబ్ ఎత్తుకున్నాడు. ఆ సమయంలో మాస్టర్ బాగానే ఫీలయ్యాడు.

తాజాగా అలా..
అయితే తాజాగా మెహబూబ్ దివి మీద ఎక్కేశాడు. బాడీ బిల్టర్ అయిన మెహబూబ్ బరువును దివి అమాంతం మోసేసింది. అయితే ఈ ఫోటోలను మెహబూబ్ షేర్ చేస్తూ.. బ్యూటీ విత్ బ్రెయిన్ కాదు.. బ్యూటీ విత్ బలం కూడా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు.

సోహెల్‌కు మద్దతు..
మెహబూబ్ తన మద్దతును పూర్తిగా సోహెల్‌కు ఇస్తున్నాడు. సోహెల్‌కు ఓట్లు వేసి విన్నర్‌ను చేయండని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే సోహెల్ హోమ్ టూర్ అంటూ మెహబూబ్ స్పెషల్ వీడియోను షేర్ చేశాడు. మొత్తానికి తన స్నేహితుడు సోహెల్ గెలుపు కోసం మెహబూబ్ బాగానే కష్టపడుతున్నాడు.


Click it and Unblock the Notifications











