అభిజిత్ ఫ్యాన్స్ మీద సైబర్ కేసులు.. ఒకచోట అలా మరో చోట ఇలా.. మోనాల్ కామెంట్స్ వైరల్
సోషల్ మీడియాలో సైబర్ దాడి గురించి అందరికీ తెలిసిందే. ఇక బిగ్ బాస్ షో సమయంలో ఇది పీక్స్‌లో ఉంటుంది. ఓ కంటెస్టెంట్ అభిమానులు మిగతా వారిపై మాటల దాడికి దిగుతారు. ఫ్యామిలీని కూడా వదలరు. మాటల దాడితో రచ్చ చేస్తున్నాడు. ఈ సైబర్ దాడికి చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. వితికా షెరు ఇదే విషయంపై ఓ సుధీర్ఘమైన వీడియోను కూడా చేసింది. అయితే తాజాగా మోనాల్ తన సోదరి, ఫ్యామిలీపై జరిగిన ట్రోలింగ్‌పై స్పందించింది.

హేమాలి ఫేమస్..
బిగ్ బాస్ షో ద్వారా మోనాల్ సిస్టర్ హేమాలి బాగా ఫేమస్ అయింది. ఆమె అభిజిత్‌ను అన్న ఒక్క మాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయింది. ఏదైనా ఉంటే ముందు మాట్లాడు.. వెనకాల మా అక్క గురించి మాట్లాడకు అని యాటిట్యూడ్ చూపించింది. ఏదో వార్నింగ్ఇచ్చినట్టుగా అభిజిత్‌కు అలా చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ హేమాలిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

ఫ్యామిలీపై ట్రోలింగ్..
బయటకు వచ్చిన మోనాల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటోంది.అయితే ఇందులో భాగంగా మీడియాలో మాట్లాడుతూ తన సోదరి హేమాలి, ఫ్యామిలీకి ఎదురైన చేదు అనుభవం గురించి బయటకు చెప్పింది. అయితే ఒక్కో చోట ఒక్కోలా చెబుతూ వస్తోంది. ఒక చోట అభిజిత్ ఫ్యాన్స్ అంటోంది. మరో చోట అభిజిత్ పీఆర్ టీం అని అంటోంది.

బెదిరింపులు..
తన సోదరి హేమాలిని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయట.. ఫ్యామిలీని దారుణంగా తిట్టారట.. మా సోదరి ఫియాన్సినీ కూడా ట్రోల్ చేశారంటూ మోనాల్ బయట పెట్టేసింది. ఇలా వారిపై జరిగిన ట్రోలింగ్‌పై సైబర్ కేసులు పెట్టారని చెప్పుకొచ్చింది.
Recommended Video

అభిజిత్ అభిమానులు..
అభిజిత్ అభిమానులు నా సోదరిని, ఫ్యామిలీని ట్రోల్ చేశారు.. అంటూ మోనాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అభిజిత్ పీఆర్ టీం తన ఫ్యామిలీపై ట్రోల్ చేసిందని మరో ఇంటర్వ్యూలో చెప్పింది. ఇదంతా చూస్తుంటే మోనాల్ ఏదో మోటివ్‌తోనే ఇదంతా చేస్తోందని అభిజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











