పరిస్థితి చూస్తుంటే విన్నర్ అతడే అయ్యేలా ఉన్నాడు.. మోనాల్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత కాలం ఎవరి ఇమేజ్ ఏంటి? ఎవరికి ఫాలోయింగ్ ఎలా ఉంది.. ఎవరి ఆట బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అలా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన మోనాల్‌కు అసలు సంగతి తెలిసి వచ్చినట్టుంది. అభిజిత్ క్రేజ్, ఫాలోయింగ్ చూసి షాక్అయినట్టు కనిపిస్తోంది. మోనాల్ తన ఎలిమినేషన్ సమయంలో బిగ్ బాస్ టైటిల్ గురించి చాలానే కామెంట్లు చేసింది. కానీ ఇప్పుడు తన మాటలేవీ నెరవేరేలా కనిపించడం లేదని తెలుసుకున్నట్టుంది.

అఖిల్‌పై కామెంట్లు..
మోనాల్ ఎలిమినేట్ అయిన తరువాత స్టేజ్ మీద నిల్చుని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గురించి బాగానే మాట్లాడింది. అఖిల్ గెలవాలని టాప్‌లో ఉండాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. మంచిగా ఆడు.. స్ట్రాంగ్‌గా ఉండాలని మోనాల్ కోరుకుంది. ఇక అంతేకాకుండా హారిక టాప్ 2లో ఉండాలని, అఖిల్ పక్కన నిల్చోవాలని కోరుకుంది.

పరిస్థితి మాత్రం భిన్నంగా..
అలా మోనాల్ కోరుకున్న దానికి బయటకు జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే అఖిల్ హారికలు అనే వాళ్లను టాప్ 2 అని ఎవ్వరూ అనుకోవడం లేదు. ప్రస్తుతం నెటిజన్లందరూ అభిజిత్ సోహెల్ అరియానాల గురించే మాట్లాడుకుంటున్నారు. టైటిల్ విన్నర్ అభిజిత్ అని నెటిజన్లు ఆల్రెడీ ఫిక్స్ చేసేస్తున్నారు. అభిజత్ గెలవడం ఖాయమని అంటున్నారు.

తాజాగా అలా..
అయితే మెనాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలు సంగతి చెప్పేసింది. తనకు అఖిల్ టైటిల్ గెలవాలని ఉంది.. లేదా సోహెల్ గెలవాలని ఉందంటూ మోనాల్ మనసులో మాటను బయటకు చెప్పేసింది. కానీ పరిస్థితి చూస్తుంటే వేరే వాళ్లు గెలిచేలా ఉందంటూ అనుమానాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆ పేరును మాత్రం వ్యక్తం చేయలేదు.

అఖిల్ అంటూ..
అయితే అలా పేరు చెప్పకపోవడం ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మరింత ముందుకు వెళ్లింది. ఆ గెలిచే వ్యక్తి ఎవరు అని అడిగింది. మీకు కూడా తెలుసంటూ మోనాల్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. A అనే వ్యక్తి గెలుస్తాడా? అంటూ సదరు వ్యక్తి అడిగితే.. అవును అఖిల్ గెలుస్తాడు.. గెలవాలని మోనాల్ చెప్పుకొచ్చింది. మొత్తానికి బయట జరుగుతున్న ట్రెండ్, పరిస్థితిని మోనాల్ బాగానే పసిగట్టింది. అభిజిత్ గెలుస్తాడని చెప్పకనే చెప్పేసింది.


Click it and Unblock the Notifications











