ఏ మనిషిని తక్కువ అంచనా వేయొద్దు.. అఖిల్ చేష్టలకు రాటుదేలిన మోనాల్.. దెబ్బ అదుర్స్!!
ఏ మనిషిని తక్కువ అంచనా వేయొద్దు. ఎవరిలో ఎంతుందో.. సమయం వస్తే ఎంతకైనా తెగించినిలబడగలరో.. నమ్మితే ఎంతటి కష్టాన్ని భరించగలరో అని మోనాల్ నిరూపించింది. ఓ కసితో మోనాల్ నిన్న కెప్టెన్సీ టాస్క్‌ను ఆడినట్టు కనిపిస్తోంది. ఆ కసి అఖిల్ అన్న మాటల వల్ల, తనను తక్కువగా అంచనా వేయడం వల్లే సాధ్యమైంది. అఖిల్ మాటలకు, అతను చేసే చేష్టలకు మోనాల్ బాగానే రాటుదేలింది. చివరకు అఖిల్‌ను గట్టిగా దెబ్బ కొట్టింది.

కెప్టెన్సీ టాస్క్...
పదకొండో వారంలో కెప్టెన్సీ టాస్క్‌లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. మామూలుగా ఇంత వరకు అన్ని వారాల్లో కెప్టెన్సీ పోటీ దారులకు మాత్రమే టాస్క్ ఇచ్చారు. కానీ ఈ సారి మాత్రం కెప్టెన్సీ పోటీ దారులకు కాకుండా మిగతా కంటెస్టెంట్లకు ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీ దారులైన అఖిల్, అభిజిత్, హారికలు మిగతా కంటెస్టెంట్లను ఒప్పించి వారి భుజాలపై కూర్చుండాలి.

అఖిల్‌కు అందరి మద్దతు..
అలా కెప్టెన్సీ టాస్క్ పెట్టడంతోనే.. అఖిల్ సోహెల్ ఒప్పందం కుదుర్చుకున్నాను. నిన్ను నా భుజాలపై మోస్తాను అని కెప్టెన్‌ను చేస్తానని అఖిల్‌కు సోహెల్ భరోసా ఇచ్చాడు. ఇక ఇది చాలదన్నట్టు అఖిల్ అవినాష్, మోనాల్‌తోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్టు కనిపిస్తోంది. తనకే సపోర్ట్ చేసేలా మాట తీసుకున్నట్టు కనిపిస్తోంది.

మోనాల్ గెలుపు..
భుజాలపై ఎత్తుకునే టాస్క్‌లో చివరి వరకు మోనాల్ కదలకుండా తొణకు కుండా అలాగే నిలబడింది. అవినాష్ మొదట్లోనే కిందపడిపోయాడు. అలా అభిజిత్ ఆట నుంచి తప్పించుకున్నాడు. సోహెల్ కూడా ఎక్కువ సేపు అఖిల్‌ను భుజంపై మోయలేకపోయాడు. చివరి వరకు మోనాల్ నిలబడింది. హారికను కెప్టెన్ చేసింది.

అఖిల్‌కు నచ్చలేదు..
మోనాల్ అలా హారికను కెప్టెన్ చేయడం అఖిల్‌కు నచ్చలేదు. దీంతో అఖిల్ దూరంగా ఉండిపోయాడు. కోపంగా బల్లను తన్నేశాడు. అయితే మోనాల్ మాత్రం సింపుల్ ఓ మాట అనేసింది. హారిక నన్ను నమ్మింది అందుకు నిలబడ్డాను అని చెప్పేసింది.
Recommended Video

అప్పుడేమో అలా..
అఖిల్ తనను బాస్కెట్, బాల్ టాస్క్‌లతో నన్ను నమ్మలేదు. సోహెల్‌పైనే ఎక్కువ నమ్మకం ఉంచాడు.. అందుకే నాతో కలిసి ఆడలేదు. ఇప్పుడు హారిక నమ్మింది. అందుకే నిలబడ్డాను. హారికను గెలిపించాను.. అది అఖిల్‌కు నచ్చడం లేదని అభిజిత్‌తో చెప్పుకొచ్చింది. టాస్క్‌లో ఒకలా, టాస్క్‌లు లేకపోతే ఒకలా తనతో వ్యవహారించే అఖిల్‌కు గట్టి దెబ్బకొట్టింది. మోనాల్‌ను తక్కువ అంచనా వేసిన అఖిల్‌కు అసలు విషయం తెలిసొచ్చింది.


Click it and Unblock the Notifications











