రేషన్ మేనేజర్‌గా అలా.. పంచాయితీ పెట్టిన మోనాల్

బిగ్ బాస్ ఎనిమిదో వారం ఆడవాళ్లకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్‌లో ఆడవాళ్లు మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. టాస్క్‌ల పరంగా అయితే ఆడవాళ్లు విజేతలు అవ్వడం కష్టంగా ఉందని ఇలా పెట్టి ఉంటాడు. అయితే ఇందులోనూ ఆడవాళ్ల మధ్య ఉన్న విబేధాలన్నీ బయట పడ్డాయి. మోనాల్‌కు హారికకు కోల్డ్ వార్ లాంటిది ఉందని ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే.

అయితే ఈ టాస్క్‌లో మోనాల్ వల్ల హారిక, అరియానా వల్ల లాస్య కెప్టెన్సీకి అర్హులు కాలేకపోయారు. ఇక చివరకు మిగిలిన మోనాల్, అరియానాలో అమ్మ రాజశేఖర్ అరియానాకు సపోర్ట్ చేయడంతో కెప్టెన్‌గా ఎన్నికైంది. అయితే అలా ఇద్దరూ ఉండటంతో అమ్మ రాజశేఖర్ మోనాల్‌కు సారీ చెప్పి.. అరియానాకు సపోర్ట్ చేశాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా మోనాల్‌కు సాయం చేస్తానని మాస్టర్ మాటిచ్చాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. మాస్టర్ ఇచ్చిన మాటకు నేను నిన్ను రేషన్ మేనేజర్‌ను చేస్తానని మోనాల్‌కు అరియానా ఆఫర్ ఇచ్చింది.

Bigg Boss 4 Telugu Monal As ration Manager

అలా అనడంతో అక్కడ పెద్ద గొడవే జరిగింది. దాని తరువాత రేషన్ మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్న మోనాల్.. అరటిపళ్లు పాడైపోయాయని అవినాష్‌కు చూపించింది. అక్కడ మామూలుగా చూపించినా కూడా నీ వల్లే జరిగాయయని చెప్పినట్టు అర్థం వచ్చింది.

దీంతో అవినాష్ మోనాల్ మధ్య గ్యాప్ వచ్చింది. ఏదైనా ఉంటే కెప్టెన్‌తో మాట్లాడుకో అని మోనాల్ మొహం మీదే చెప్పాడు. అరియానా కూడా అదే మాట చెప్పింది. ఏదైనా ఉంటే నాతోనే చెప్పు అని మోనాల్‌కు సూచించింది. మొదటి సారిగా అరియానా కెప్టెన్, రేషన్ మేనేజర్‌గా మోనాల్ ఉండటంతో అంతా గజిబిజి గందరగోళమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X