Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంటపెట్టిన మోనాల్.. సోహెల్-అఖిల్ మధ్య దూరం.. ఆ పనులు మానేయ్!!
బిగ్ బాస్ షోలో ఒక్క చిన్న మాట ఎన్నో మనస్పర్దలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక చోట మాట్లాడుకునే మాటలు ఇంకో చోటుకు మోసుకెళ్తే అక్కడ లేనిపోని దూరం పెరుగుతుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి మాట్లాడుకోవడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్లే మోనాల్ అభిజిత్ దూరంగా ఉంటున్నారు. ఎవరో ఎక్కడే మ్యానిపులేటివ్ అనే పదాన్ని వాడారని మోనాల్ చెప్పడంతో ఓ గొడవ ఇంకా జరుగుతూనే ఉంది.
సోహెల్ చెప్పినా..
ఒక చోట మాట్లాడినా మాటలు వేరే దగ్గరికి వెళ్లి చెప్పకు అని సోహెల్ మోనాల్‌కు ముద్దుగా చెప్పాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే నువ్ వింటే ఎవ్వరితోనూ చెప్పకు. నా గురించి మాట్లాడుకున్నా సరే అవి నాకు చెప్పకు అని మోనాల్‌కు సోహెల్ అర్థమయ్యేలా చెప్పాడు. కానీ చివరకు మళ్లీ అదే పని చేసింది.
అఖిల్ సోహెల్..
అఖిల్ సోహెల్ నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటూ.. రాత్రి ఒంటిగంటకు బాగానే చర్చించుకున్నారు. తన మనసులో అరియానా ఒక్కతే ఉంది ఇక రెండో మనిషి గురించి ఆలోచించలేదని నామినేషన్ గురించి ఇద్దరూ బాగానే చర్చించుకున్నారు. అలా అనొద్దు ఎవ్వరూ సెకండ్ ఆప్షన్ లేరని ఎలా అంటావ్ అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు.
నోయల్ వద్ద చర్చ..
ఇక అలా అఖిల్‌తో చర్చించిన సోహెల్.. నోయల్ వద్దకు వెళ్లి ముచ్చిటించాడు. అప్పటికే అక్కడ నోయల్‌తో మోనాల్ ముచ్చట్లు పెడుతోంది. సోహెల్ వచ్చి అఖిల్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో మోనాల్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. సోహెల్ ఎక్కడ అని మోనాల్‌ను అఖిల్ అడగడంతో నోయల్ దగ్గర నీ టాపిక్ మాట్లాడుతున్నాడని ఓ పుల్ల పెట్టింది.
సోహెల్ అఖిల్ మధ్య దూరం..
అలా మోనాల్ చెప్పినా ఆ చిన్న మాటతో అఖిల్ హర్ట్ అయ్యాడు. సోహెల్‌ను దూరం పెట్టాడు. సోహెల్ ఎంత చెప్పినా అఖిల్ వినడం లేదు. నోయల్ నామినేషన్ గురించి మాట్లాడాను. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి అఖిల్‌ను, మెహబూబ్‌ను నామినేట్ చేశావని మాట్లాడాను అంటూ సోహెల్ చెప్పినా అఖిల్ మాత్రం మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
ఆ పనులు మానేయ్..
నోయల్ తాను మాట్లాడుకున్న విషయం అఖిల్‌కు ఎందుకు చెప్పావ్ అంటూ మోనాల్‌ను సోహెల్ ప్రశ్నించాడు. ఇంతకు ముందే చెప్పాను కదా ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుకుంటే వేరే చోటుకు వెళ్లి చెప్పొద్దని మళ్లీ ఎందుకు చెప్పావ్ అంటూ ఫైర్ అయ్యాడు. సోహెల్ ఎక్కడా అని అడిగితే ఏమో తెలీదు అని చెప్పాలి.. లేదా ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలీదు అని చెప్పాలి అంతే కానీ ఇలాంటి పనులో మానేయ్ అంటూ సూచించాడు.