అందుకే మోనాల్‌ను పంపించరు.. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదుగా!
బిగ్ బాస్ షోలో గ్లామర్ షో చేసే కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అయితే స్కిన్ షో చేయడంలో తప్పు లేదు. జనాలను ఆకట్టుకోవడానికి అది కూడా ఓ పద్దతే. అయితే అందులో కొన్ని హద్దులుంటాయి. ఆ పరిధి మేర ఎంత చేసినా ఏమీ అనిపించదు. ప్రేక్షకులు కూడా వాటిని రిసీవ్ చేసుకుంటారు. మాములూగా అయితే బిగ్ బాస్ అనేది ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే షో. ఇందులో ఇలాంటి అందాల ఆరబోతలు చేయడం కంటే పద్దతిగా కనిపిస్తేనే మంచిది. కానీ మోనాల్ మాత్రం అందాలతో తిరుగులేని అస్త్రాలను వదులుతోంది.

మోనాల్ డ్రెస్సింగ్..
బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ మామూలుగా పద్దతిగానే ధరిస్తూ ఉంటుంది. కాకపోతే మార్నింగ్ మస్తీలో డ్యాన్స్ చేసేటప్పుడు వీకెండ్ ఎపిసోడ్‌లో మాత్రం తన సత్తాను చాటుతుంది. అందాల ఆరబోతలో మోనాల్‌ను మించిన వారు ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనట్టుగా రెచ్చిపోతుంది. గత రెండు మూడు వారాల క్రితం మోనాల్ వేసుకున్న డ్రెస్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

ఐదో వారంలో రచ్చ..
ఐదో వారం ఎపిసోడ్‌లో మోనాల్ వేసుకున్న డ్రెస్‌కు, ఎక్స్‌పోజింగ్ సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. మోనాల్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. ఓట్ల కోసం ఇలాంటివి చేస్తావా? అంటూ విరుచుకపడ్డారు. ఆ వారం సుజాత ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయింది. సుజాత, కరాటే కళ్యాణి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మోనాల్‌ను ఏకిపారేసింది.

మేము అలాంటివి చేయలేం
మోనాల్‌లా మేము బట్టలు వేసుకోం.. ఆమెలా మేము ఎక్స్ పోజ్ చేయలేం కాబట్టి మమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు. వాళ్లకు కావాల్సినట్టుగా ఆమె చేస్తుంది కాబట్టి ఆమెను షోలో ఉంచుతారు అంటూ కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. జనాలు కూడా ఆమె మాటలకు వత్తాసు పలికారు. మోనాల్‌ను ఘోరంగా ట్రోల్ చేశారు.

తాజాగా వీకెండ్‌లో..
నిన్నటి వీకెండ్ ఎపిసోడ్‌లోనూ మోనాల్ మళ్లీ రచ్చ లేపింది. బిగువైన డ్రెస్సును ధరించి హాట్ క్లీవేజ్ షోకు తెరలేపింది. ఈ రేంజ్‌లో స్కిన్ షో చేస్తే ఎందుకు ఎలిమినేట్ చేస్తాడని సోషల్ మీడియాలో గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఈ వారం కూడా మోనాల్‌కు గండం గట్టెక్కినట్టైంది.


Click it and Unblock the Notifications











