ఆ విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా మోనాల్.. ఆ బుద్ది అప్పుడు ఏమైంది?

బిగ్‌బాస్ షోలో ఐదో వారం ట్విస్టుల మీద ట్విస్టులు జరగబోతోన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక ట్రయాంగిల్ కథకు ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తోంది. నిన్నటి ఎపిపోడ్‌లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ అఖిల్ మోనాల్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇంట్లోని ప్రతీ ఒక్కరూ ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలని బిగ్ బాస్ తెలిపాడు. ఈ ఐదో వారం నామినేషన్ ప్రక్రియ ఇంట్లో మంట పుట్టించింది.

అభిజిత్ అఖిల్ వార్..

అభిజిత్ అఖిల్ వార్..

ఐదో వారం నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ అఖిల్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇంట్లో చాలా మంది అఖిల్‌ను నామినేట్ చేశారు. రేషన్ మేనేజర్‌గా విఫలమైనందుకు చాలా మంది అతని పేరును నామినేట్ చేశారు. అభిజిత్ కూడా అదే విషయంలో నామినేట్ చేశాడు. దాంతో పాటు ఇంకొన్ని కారణాలు కూడా చెప్పాడు.

అరేయ్ ఒరేయ్ ఏంటో..

అరేయ్ ఒరేయ్ ఏంటో..

అభిజిత్ అఖిల్ మధ్య గొడవ మొదలైంది ఈ అరేయ్ ఓరేయ్ పిలుపుతోనే. తన కంటే చిన్నవాడైన అఖిల్ తనను ఒరేయ్ అరేయ్ అని పిలవడం అభిజిత్‌కు నచ్చలేదట. దగ్గరున్నప్పుడు రా అని పిలవడం వేరు.. దూరం నుంచి ఒరేయ్ రారా అరేయ్ రారా అని పిలవడ కూడదట. ఈ విషయంలో వారిది సిల్లీ గొడవలా అనిపించింది.

మోనాల్‌ను లాగేశాడు..

మోనాల్‌ను లాగేశాడు..

నామినేషన్‌లో ఎవరి విషయాలు వారే చెప్పుకుంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు. కానీ అఖిల్ మోనాల్ విషయం ఎత్తుతూ అభిజిత్‌తో గొడవకు దిగాడు. ఓ అమ్మాయి గురించి చెడుగా చెబుతున్నావ్ అంటూ మోనాల్‌ను మధ్యలోకి లాగడంతో గొడవ తారా స్థాయికి చేరుకుంది. ఆమె మ్యాటర్ నీకెందుకు. ఏదైనా ఉంటే మేం ఇద్దరం చూసుకుంటాం కదా అని అభిజిత్ కౌంటర్ ఇచ్చాడు.

పరువు తీయకండి..

పరువు తీయకండి..

తన పేరును మధ్యలో తీయడంతో మోనాల్ ఫైర్ అయింది. ఎవరి సమస్యలు వారే మాట్లాడుకోండి.. మధ్యలో నన్ను లాగకండి.. ఇలా పరువుతీయకండి.. ఇది నేషనల్ చానెల్.. అంతా ప్రసారం అవుతుంది.. అందరూ చూస్తుంటారు.. అన్నింటికంటే పరువు ప్రతిష్ట ముఖ్యం అని మోనాల్ బోరును ఏడ్చింది.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
మరి అప్పుడు ఏమైంది..

మరి అప్పుడు ఏమైంది..

అయితే నామినేషన్‌లో జరిగిన గొడవతో నేషనల్ చానెల్ అని గుర్తుకు వచ్చిన మోనాల్‌కు షో జరుగుతున్నంత సేపు గుర్తుకు రాకపోవడం విచిత్రం. అభిజిత్, అఖిల్‌లతో ఇద్దరితో ఉండటం, అక్కడ లేకపోతే ఇక్కడ, ఇక్కడ లేకపోతే అక్కడ ఇలా డబుల్ గేమ్ ఎందుకు ఆడటం, ఇద్దరిని ఇలా దూరం చేయడం ఎందుకు? ఏదైనా ఉంటే ముగ్గురు ఒక చోట కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అయిపోతుంది కదా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X