Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అఖిల్ కోసం మోనాల్ ఆరాటం.. కెప్టెన్సీ గొడవలో మధ్యలో దూరి..
బిగ్ బాస్ 65వ రోజు నిజంగా అందరికి ఒక విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమయ్యింది. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అనే డైలాగ్ ని గుర్తు చేశారు. కెప్టెన్ పోస్ట్ కోసం ఎంతగా తాపత్రయ పడ్డారో అందరికి చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. కంటెస్టెంట్స్ మధ్యలో ఒక బాండింగ్ ఉంటుంది అనే మాట అంత నిజమైంది కాదని చాలా ఈజీగా తెలిసిపోయింది. ముఖ్యంగా ఒక విధంగా అఖిల్ తన పరువు తీసేసుకున్నాడని టాక్ వస్తోంది.
కెప్టెన్సీ కోసం ఆ మాటలను మర్చిపోయారు
టాస్క్ లో ఏం జరిగినా కూడా డేంజర్ జోన్ లో ఉండే వారికి బిగ్ బాస్ కెప్టెన్సీ ఇస్తే బెటర్ అని కంటెస్టెంట్స్ అభిప్రాయపడుతుంటారు. కానీ ఎవరు ఊహించని విధంగా మంగళవారం ఎపిసోడ్ లో మెహబూబ్ డేంజర్ జోన్ లో ఉన్నాడని చెప్పినా కూడా అఖిల్ త్యాగం చేయలేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మన ఫ్యామిలీ మనమంతా ఒక్కటి అనుకునేవారు కెప్టెన్సీ కోసం ఆ మాటలను మర్చిపోయారు.
మధ్యలో దూరిన మోనాల్
నాకు ఎవరు ఏం చేయలేదు. మీ ఫ్రెండ్షిప్ వల్ల నాకు ఒరిగిందేమి లేదని అఖిల్ గట్టిగానే వాదించాడు. అయితే మధ్యలో మోనాల్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అఖిల్ కోసమే ఆమె ఆరాటపడినట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. అఖిల్ చాలా మంచి వాడు అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట చేసింది. నామినేషన్ లో నువ్వు (సోహైల్) నేను ఉంటే నిన్నే సేవ్ చేసే రకం అఖిల్ అంటూ అతనికి సపోర్ట్ చేసింది.
సోహైల్ కి కూడా మాట్లాడే ఇంట్రెస్ట్ పోయింది
ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోండి అంటూనే అఖిల్ ని కెప్టెన్ చేస్తే బెటర్ అన్నట్లుగా మోనాల్ సోహైల్ తో చర్చించింది. కానీ ఆ చర్చలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అఖిల్ మాట్లాడుతుండగా కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోవడంతో సోహైల్ కి కూడా మాట్లాడే ఇంట్రెస్ట్ పోయింది. ఇక బిగ్ బాస్ కూడా చివరికి సూట్ కేసులు సర్దుకోమ్మని ట్విస్ట్ ఇచ్చాడు.
రోజురోజుకు మరింత స్వార్థంగా..
చూస్తుంటే అఖిల్ రోజురోజుకు మరింత స్వార్థంగా మారుతున్నట్లు అర్ధమవుతోంది. బిగ్ బాస్ లో అలాంటివి కామన్ అయినప్పటికీ అవసరం అన్నప్పుడు ఒకలగా అవసరం లేనప్పుడు మరొక లాగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్న మోనాల్ ని నామినేట్ చేసి హైలెట్ అయిన అఖిల్ గత వారం అభిజిత్ తో స్నేహం చేసి అతను ఎలిమినెట్ అవ్వాలని టార్గెట్ చేశాడు. ఇక ఇప్పుడు కెప్టెన్ పోస్ట్ కోసం మొన్నటివరకు మనం మనం ఒక్కటి అన్న వారికి కూడా దూరమయ్యాడు. మరి అఖిల్ కి ఆడియెన్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి.