ఇవన్నీ చెప్పి నన్ను బ్యాడ్ చేస్తావా.. నమ్మకం పెట్టుకున్న ప్రతిసారి ముంచేస్తున్న మోనాల్

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ట్రాక్ లోకి వచ్చేసింది. కంటెస్టెంట్స్ మధ్య ఇక ప్రేమ స్నేహం అనురాగలకు తావు ఉండదు. పాత బంధాలన్ని ఇక మడిచి అవతల పడయ్యాల్సిందే అనేంతలా బిగ్ బాస్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడున్న సూపర్ సేవన్ కంటెస్టెంట్స్ లలో ఎవరికి వారు వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నారు. కానీ యుద్ధంలో గెలిచేది ఒక్కరు మాత్రమే. అయితే మోనాల్, అఖిల్ ల వ్యవహారం మాత్రం ప్రతి వారం చాలా రొటీన్ గా నడుస్తోంది. అఖిల అయితే ఆమెతో మరోసారి తెగదెంపులు చేసుకున్నాడు.

అసలు రంగు బయటపడేలా..

అసలు రంగు బయటపడేలా..

ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసిన బిగ్ బాస్ కలర్ ట్యూబ్ లను మెడలో వేసుకొని నామినేట్ చేయాల్సిన కంటెస్టెంట్స్ బౌల్ లో రంగు నీళ్లను పోయాలని ఆదేశించారు. ఇక కంటెస్టెంట్స్ మధ్య అసలు రంగులు బయటపడేలా బిగ్ బాస్ వేసిన ప్లాన్ కరెక్ట్ గా సెట్టయినట్లు అర్ధమయ్యింది. కామన్ గా ప్రతి ఒక్కరి విషయంలో ఈ వారం ఊహించని ట్విస్టులు మొదలయ్యాయి.

నన్ను బ్యాడ్ చేయాలని అనుకుంటున్నవా

నన్ను బ్యాడ్ చేయాలని అనుకుంటున్నవా

ఇక మోనాల్, అఖిల్ ని నామినేట్ చేయడంతో వారి మధ్యలో ఎప్పటిలానే రొటీన్ మాటలు నడిచాయి. నేను నీ కోసం ఎంతో పోరాడితే నువ్ ధీమాక్ పెట్టి గేమ్ అడతావేమో అనిపిస్తది.. కానీ నువ్ అలా ఆడలేవు అంటూ సమాధానం ఇవ్వగా నేను గేమ్ ను హార్ట్ తో అడతాను.. బ్రెయిన్ తో కాదు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఇద్దరి మధ్య మాటల తూటాలు గట్టిగానే కొనసాగాయి.

ఇవన్నీ చెప్పి నన్ను బ్యాడ్ చేస్తావా

ఇవన్నీ చెప్పి నన్ను బ్యాడ్ చేస్తావా

నిజానికి అవసరం ఉన్న ప్రతిసారి అఖిల్ మోనాల్ హెల్ప్ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆమె మాత్రం ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. నువ్వే గేమ్ సరిగ్గా ఆడమంటావ్.. మనసుకు అనిపించింది చేయి అంటావ్.. మళ్ళీ నన్నే తప్పు బడతావా అంటూ షాకుల మీద షాకులు ఇస్తోంది మోనాల్. దీంతో ఇవన్నీ చెప్పి నన్ను బ్యాడ్ చేయాలని అనుకుంటున్నవా అంటూ అఖిల్ మ్యాటర్ కాంప్లిటెడ్ అని ఎప్పటిలానే కౌంటర్ ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
అరియానకు ఇచ్చి పడేసిన మోనాల్..

అరియానకు ఇచ్చి పడేసిన మోనాల్..

ఇక అరియానా, హారిక మధ్యలో కూడా మాటల యుద్ధం గట్టిగానే నడిచింది. అరియానా నామినేట్ చేసిందో ఏమో గాని ఇంగ్లీష్ లో నువ్వు నా బాస్ కాదని ఇచ్చి పడేసింది. ఇక ఇంగ్లీష్ ఎక్కువవ్వడంతో తెలుగులో మాట్లాడండని చెప్పిన అవినాష్ పై కూడా అరిచేసింది మోనాల్. మధ్యలో మాట్లాడకు అంటూ వాయిస్ పెంచేసింది. ఎవరైనా ఇక్కడ మాట్లాడతారు అంటూ మళ్ళీ ఇంగ్లీష్ లోనే ఇచ్చేసింది. మరి ఈ గోడవలతో కంటెస్టెంట్స్ హౌజ్ లో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X