బల్లగుద్ది చెబుతున్నా నీ కంటే 200రేట్లు బెటర్ నేను.. విర్రవీగిన అవినాష్, గాలి తీసేసిన మోనాల్, సోహెల్

బిగ్ బాస్ 79వ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా కొనసాగిందనే చెప్పాలి. హౌజ్ లో ఇంకా ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఇక కెప్టెన్సీ పోస్టుతో అలాగే లాస్య మద్దతుతో ఎలిమినేషన్ నుంచి బయటపడిన హారికకు ఈ వారం పెద్దగా టెన్షన్ లేదు. ఇక మిగతా వారిలో సోహైల్, అభి తప్పితే అందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు అర్ధమయ్యింది. ఇక అవినాష్ అయితే సోమవారం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులకు షాక్ అయ్యాడు. ఒక విదంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా..

అసహనం వ్యక్తం చేసిన అభి, అవినాష్

అసహనం వ్యక్తం చేసిన అభి, అవినాష్

గార్డెన్ లో ఉన్న టోపీలను దరించగా అందులో ఎరుపు రంగు వచ్చిన వ్యక్తుల్లో అవినాష్ ఒకడు. శవపేటికలో ఉండి అవసరం అయితే మరొకరిని ఒప్పించి స్వాప్ చేసుకోవచ్చని ఆఫర్ ఇవ్వగా అవినాష్ మొదట ఆ ప్రక్రియపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు.గేమ్ సరిగ్గా అడలేమన్నట్లుగా ఇంటికి వెళ్లిపోవాలా అని నామినేషన్ ప్రక్రియను తప్పుపట్టాడు అవినాష్. దీంతో అభిజిత్ కూడా ఇది మన తలరాత బ్రదర్ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

సోహెల్ సహాయాన్ని కోరిన అవినాష్

సోహెల్ సహాయాన్ని కోరిన అవినాష్

అయితే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదన్న బిగ్ బాస్ బయట ఉన్నవారిని స్వాప్ చేసుకోవచ్చని షాక్ ఇచ్చాడు. దీంతో అవినాష్ మొదట తన పార్ట్ టైమ్ మిత్రుడు సోహెల్ ని రిక్వెస్ట్ చేశాడు. నాలుగో వారంలో నేను నీకు సపోర్ట్ చేసి నామినేట్ అయ్యాను. కెప్టెన్సీ విషయంలో కూడా నువ్ హెల్ప్ చేశావ్. ఫిజికల్ గా నువ్ నా కంటే స్ట్రాంగ్ కాబట్టి ఈ సమయంలో నా కోసం స్వాప్ అవ్వాలని అవినాష్ సోహైల్ ను కోరాడు.

హెల్ప్ చేస్తాడని అనుకుంటే గాలి తీసేశాడు

హెల్ప్ చేస్తాడని అనుకుంటే గాలి తీసేశాడు

స్వాప్ అవ్వడానికి సోహైల్ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఈ నాలుగు వారాలు నాకు చాలా కీలకమైనవి అంటూ.. నా అదృష్టం కొద్దీ నేను ఇప్పుడు నామినేట్ కాలేదు.. లేకుంటే నేనే నామినేట్ అయ్యేవాడిని అంటూ సోహెల్ షాక్ ఇచ్చాడు. అలా సోహెల్ వివరణ ఇవ్వడంతో అవినాష్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. తప్పకుండా హెల్ప్ చేస్తాడని అనుకుంటే సోహెల్ ఒక విధంగా అవినాష్ గాలి తీసేశాడు.

నేను 200% ఈ షోకి అర్హుడిని..

నేను 200% ఈ షోకి అర్హుడిని..

ఇక తరువాత కంటెస్టెంట్ మోనాల్ ని టార్గెట్ చేసిన అవినాష్ ఆమెతో కాస్త గట్టిగానే వాదించాడు.. బల్లగుద్ది చెబుతున్నా నీ కంటే నేను 200% ఈ షోకి అర్హుడినని ఆమెను త్యాగం చేయాల్సిందిగా షాక్ ఇచ్చాడు. నీ కంటే నేనే బాగా ఆడుతున్నాని అంటూ.. అసలు నీకు బిగ్ బాస్ లో ఉండే అర్హతే లేదన్నట్టుగా అవినాష్ కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడని టాక్ వచ్చింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
మొండిగా కౌంటర్ ఇచ్చిన మోనాల్

మొండిగా కౌంటర్ ఇచ్చిన మోనాల్

ఇక మోనాల్ కూడా తనదైన శైలిలో అవినాష్ కు అదే తరహాలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.. నువ్వు నిజంగా అర్హుడివి అయితే అక్కడే ఉండు. మీరు అంత మంచి గేమ్ అడుతున్నప్పుడు భయమెందుకు.. నువ్వే ఓటింగ్స్ ద్వారా సేఫ్ లో ఉంటావ్. నేనైతే ఇక్కడి నుంచి కదిలేది లేదని మోనాల్ అతని గాలి తీసేసినట్లు కౌంటర్ ఇచ్చింది. ఇక చివరికి హారిక నిర్ణయంతో అభిజిత్, మోనాల్ ల మధ్య స్వాపింగ్ జరిగింది. సైలెంట్ గా ఉన్న అభి ఊహించినట్టుగానే సేవ్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X