ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ ఆశించాడా? అఖిల్‌పై మోనాల్ దారుణమైన కామెంట్స్
బిగ్ బాస్ షోలో ప్రేమ కథలకు ఎండ్ పడేలా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన ట్రాకుల్లో ఏమీ లేదని తెలిసిపోతోంది. మొదటి రెండు వారాల్లో ప్రేమ దేశం అంటే ఎంతో ఎంకరేజ్ చేసిన బిగ్ బాస్ ఆ తరువాత మారిన పరిస్థితులతో మోనాల్ అభిజిత్ ట్రాక్ మధ్యలో ఖతమైంది. తాజాగా అఖిల్ మోనాల్ ట్రాక్ కూడా దూరమయ్యేలానే కనిపిస్తోంది. ఇక అవినాష్ అరియానా ట్రాక్ కేవలం ఫ్రెండ్‌షివ్ వరకే అని తేలిపోయింది. తొమ్మిదో వారం నామినేషన్స్ మొత్తం గందరగోళగా మారింది.

ఎనిమిదో వారంలో అలా..
బిగ్ బాస్ ఇంట్లో ఎనిమిదో వారం కొన్ని వింతలు జరిగాయి. అరియానా కెప్టెన్ అవ్వడం, నోయల్ ఇంటి నుంచి వెళ్లడం, అలా ఎలిమినేషన్స్ నుంచి ఇంటి సభ్యులు తప్పించుకోవడం వంటి ఘటనలు జరిగాయి. అందులో మోనాల్ పెట్టిన చిచ్చు గుట్టును సోహెల్ అఖిల్‌లకు నాగార్జున చూపించడం జరిగింది.

మోనాల్ మాట మార్చడంతో..
సోహెల్ నోయల్ ఏదో మాట్లాడుకుంటూ ఉండటంతో ఆ విషయాన్ని అఖిల్ వద్ద ప్రస్థావించింది. అందులోనూ కాస్త మాట మార్చి చెప్పడంతో అఖిల్ సోహెల్ మధ్య దూరం పెరిగింది. ఇద్దరూ మాట్లాడుకోలేదు. మళ్లీ చివరకు మాట్లాడుకున్నారు. అయితే నాగార్జున ఓ వీడియోను ప్రసారం చేసి చూపించి మోనాల్ గుట్టు రట్టు చేశాడు.

నామినేషన్‌లో ఎఫెక్ట్..
అలా మోనాల్ చెప్పిన మాటతో తమ మధ్య దూరం పెరిగిందని సోహెల్ నామినేట్ చేసేశాడు. దాంతో మోనాల్ కన్నీరు పెట్టేసుకుంది. ఇక నేటి ఎపిసోడ్‌లోఅఖిల్ కూడా నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో అఖిల్ చేసిన చర్యకు ఇంటి సభ్యులందరూ షాక్ అయినట్టు కనిపిస్తోంది.
Recommended Video
ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ..
అఖిల్ నామినేట్ చేయడం మోనాల్ జీర్ణించుకోలేకపోయినట్టుంది. అమ్మ రాజశేఖర్‌తో గొడవ అయినా సరే వెళ్లి ఆయనతోనే ముచ్చట్లు పెట్టింది. అఖిల్ అలా చేయడమేంటని అమ్మ రాజశేఖర్ సానుభూతి వ్యక్తం చేశాడు. అమ్మాయి అబ్బాయి అంటే ఫ్రెండ్షిప్ కాదు ఇంకా ఏదో కావాలి అనుకుంటారు..అది లేదు కదా.. అదే ప్రాబ్లమ్ అంటూ అమ్మ రాజశేఖర్‌తో అఖిల్ గురించి మోనాల్ చెప్పుకొచ్చింది. అంటే అఖిల్ ఇంకా ఏదో ఆశించాడనేట్టుగా మోనాల్ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











