అవినాష్ మటన్ ఎఫెక్ట్.. నామినేషన్‌లో టార్గెట్ సెట్ చేసుకున్న కంటెస్టెంట్స్

బిగ్ హౌజ్ ఎలిమినేషన్ లో గత వారం డేంజర్ జోన్ లో ఉండి ఆఖరి నిమిషంలో అవినాష్ సేవ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కంటెస్టెంట్స్ అతనిని నామినేట్ చేసేలా ఉన్నారని అనిపిస్తోంది. జోక్ గా కామెంట్స్ చేస్తున్నప్పటికీ చివరికి అదే సీరియస్ అయ్యేలా ఉందనిపిస్తోంది. అమ్మా రాజశేఖర్ తో పాటు డబుల్ ఎలిమినేషన్ లో బయటకు వెళ్లిపోతాడేమోనని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో నాగార్జున ఇచ్చిన ట్విస్టుతో మళ్ళీ హౌజ్ లోకి వచ్చాడు అవినాష్.

అలాంటి స్టంట్స్ ఏమైనా వేస్తున్నాడా..

అలాంటి స్టంట్స్ ఏమైనా వేస్తున్నాడా..

ఇక శనివారం ఎపిసోడ్ లో అవినాష్ పై హౌజ్ మెంట్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. కెప్టెన్ గా కూడా కొనసాగిన అవినాష్ హౌజ్ లో ఉన్న వారిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు గాని టాస్కుల విషయంలో మాత్రం రచ్చ గట్టిగానే చేశాడు. అప్పట్లో సీక్రెట్ టాస్కులతో ఊహించని విధంగా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అలాంటి స్టంట్స్ ఏమైనా వేస్తున్నాడా అనే అనుమానం అందరికి వచ్చింది.

మటన్ పాడయిన విషయాన్ని గుర్తు చేస్తూ..

మటన్ పాడయిన విషయాన్ని గుర్తు చేస్తూ..

ఈ వారం మటన్ తినాలని ఎంతో ఆశగా ఎదురుచూసిన కంటెస్టెంట్స్ ని అవినాష్ నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. రేషన్ మేనేజర్ గా ఉన్న అవినాష్ మటన్ ను డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలని తెలియక నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టడంతో అది పాడవుతుంది. ఇక ముందే ఆ విషయం కొందరికి చెప్పానని అరిచినప్పటికి.. ఆ మాత్రం విషయం కూడా తెలియదా అంటూ సోహైల్ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చేశాడు.

అతన్ని నామినేట్ చేయాల్సిందే..

అతన్ని నామినేట్ చేయాల్సిందే..

అవినాష్ చేసిన పొరపాటుకు ఈ వారం కూడా మటన్ లేదని లిస్టు రావడంతో అవినాష్ పై విరుచుకుపడ్డారు హౌజ్ మెంట్స్. మొన్ననే సీక్రెట్ టాస్క్ చేసినా చేస్తాడు అంటూ మరో అనుమానం వ్యక్తం చేశాడు మెహబూబ్. ఇక సరదాగా కొడుతూనే రివెంజ్ తీర్చుకున్నాడు. అభిజిత్ సోహైల్ కూడా కలిసి అవినాష్ పై అసహనం వ్యక్తం చేశారు. అతన్ని నామినేట్ చేయాల్సిందేనని కౌంటర్ ఇచ్చారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
అందరు నామినేట్ చేసేది నిన్నే..

అందరు నామినేట్ చేసేది నిన్నే..

కనీసం ఈ విషయం తెలియకుండా ఎలా ఉన్నావ్ అంటూ అతని పరువు తీశారు. ఇక లాస్య అయితే తన నవ్వుతో మాటలతో పొడుస్తూనే ఉంది. పరిస్థితిని గమనిస్తే నెక్స్ట్ వీక్ మాటన్ కారాణంతో అవినాష్ ని నామినేట్ చేసేలా ఉన్నారనిపిస్తోంది. చికెన్ కూడా బావుంటుందని దానితో అడ్జస్ట్ అవుదామని అవినాష్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు గాని సోహైల్ అందుకు కనికరించలేదు. నెక్స్ట్ అందరూ నామినేట్చేసేది నిన్నే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X