లేని కట్టప్పకు ఎందుకింత బిల్డప్.. వెన్నుపోటు పొడిచేందుకు ఖడ్గంతో నాగ్ ఎంట్రీ!
బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌లో మొదటి వీకెండ్‌లో రచ్చ చేసేందుకు హోస్ట్ నాగార్జున సిద్దమయ్యాడు. ఈ మొదటి వారంలో మొత్తం ఓ మాదిరిగా వెళ్లిపోయింది. ఎంటర్టైన్మెంట్ విషయంలో బిగ్‌బాస్ ఫెయిల్ అయ్యాడు. దివి చెప్పినట్టుగా అమ్మ రాజశేఖర్ వేసే కుళ్లు జోకులు భరించలేకపోతోన్నారు జనాలు. ఇక సీజన్ ప్రారంభంలో మోనాల్ ఏడుపులు, కరాటే కళ్యాణి అరుపులు ఇప్పుడు అంతగా కనిపించడం వినిపించడం లేదు. ఇక మొదటి వీకెండ్ రానే వచ్చింది. నాగార్జున కూడా అందరి లెక్కలను సెట్ చేసేందుకు బాగానే ప్రిపేర్ అయినట్టు కనిపిస్తున్నాడు.

వారంతా అదే ఆలోచనలో..
బిగ్‌బాస్ మొదటి వారంలో అందరి మదిలో ఒకే ఆలోచన మొదలైంది. కట్టప్ప ఉన్నాడని బిగ్ బాస్ ప్రకటించం, చంద్రుడిలో మచ్చలా మీలోనే ఒక కట్టప్ప ఉన్నాడని చెప్పడంతో ఇంటి సభ్యులందరిలోనూ అనుమానం మొదలైంది. ఎవరా? ఎవరా? అని అందరూ ఆలోచించడం, అనుమానించడం మొదలుపెట్టారు.

మూడు టాస్కులు..
కేవలం కట్టప్ప విషయం చుట్టూనే ఈ వారం మొత్తం తిప్పాడు. దీంతో జనాలు సైతం చీ కొట్టేలా చేశాడు. ఆ కట్టప్ప ఎవడన్నది వాళ్లకి చెప్పడు.. చూసే ఆడియెన్స్‌కు తెలీదు. ఆ విషయాన్నే సాగదీస్తూ సాగదీస్తూ వచ్చాడు. దాని కోసం ఏకంగా మూడు టాస్కులను పెట్టేశాడు. చివరకు ఫలితం శూన్యం. ఇక ఈ కట్టప్ప సంగతి తేలుస్తా అంటూ నాగార్జున వీర లెవెల్‌లో వచ్చాడు.

కట్టప్ప సంగతి..
కట్టప్ప ఎవరంటూ ఇంటి సభ్యుల్లో గొడవలు, దూరాలు, అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరూ మిగతా వాళ్లను పూర్తిగా నమ్మలేకపోతున్నారు. సూర్య కిరణ్, నోయల్, లాస్య వంటి వారిపై మిగతా హౌస్ మేట్స్ ఎక్కువగా అనుమాన పడుతున్నారు. అయితే అసల కట్టప్ప ఎవరనేది తేల్చేద్దామంటూ ఖడ్డం పట్టుకుని నాగ్ ఎంట్రీ ఇచ్చాడు.

లేని కట్టప్పను ఎలా..
అసలు కట్టప్ప లేనే లేడని దేవీ నాగవల్లి పసిగట్టేసింది. బయట జనాలు కూడా దాన్ని గమనించారు. కన్నడ ఏడో సీజన్‌లోనూ ఇలా స్ట్రాటజీ ప్లే చేశారట. అందులో చివరి వరకు ఇలానే బయపెట్టాడట కానీ కట్టప్ప ఎవరో కూడా రివీల్ చేయలేదట. ఇప్పుడు కూడా అంతే. లేని కట్టప్ప సంగతి తేలుస్తా అంటూ ఖడ్గం పట్టుకొచ్చిన నాగ్.. ప్రేక్షకులను వెన్నుపోటు పొడవడు కదా. చూడాలి అసలు నేటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











