Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగార్జున మాటలకు బిక్క మొహం వేసిన అభిజిత్.. ఆఖరికి హారిక కూడా హ్యాండ్ ఇచ్చింది
బిగ్ బాస్ 4 తెలుగు శనివారం ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అనేలా కొనసాగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పరభాషా షోను కూడా మిక్స్ చేయడం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ ను పలకరించిన నాగార్జున హౌజ్ మెంట్స్ కి కూడా సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక షోలో అభిజిత్, అమ్మా రాజశేఖర్ మధ్య జరిగిన పరిణామాలను ఎక్కువగా హైలెట్ చేశారు నాగ్. ఒక విధంగా అభిజిత్ చేసిన పనులపై నాగ్ కౌంటర్ కూడా వేశారు.
కెప్టెన్ అయినా కూడా ఎలిమినేట్ అవుతారు
నామినేషన్స్ లో ఉన్న అభిజిత్, మోనాల్, అమ్మా, హారిక, అవినాష్ లతో మాట్లాడిన నాగార్జున ముందుగా వారి గత పొరపాట్లను హైలెట్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారని అడగ్గా అమ్మా రాజశేఖర్ ముందుగా తాను ఆల్రెడీ ఒకసారి ఇంటికి వెళ్లివచ్చాను అంటూ సమాధానం ఇవ్వగా.. అయ్యో మాస్టర్ కెప్టెన్ అయినా కూడా ఎలిమినేట్ అవుతారు అంటూ నాగ్ ఆన్సర్ ఇచ్చారు.
మాస్టర్ విషయంలో అది నచ్చడం లేదు
ఇక తన మనోగతాన్ని చెప్పామని అభిజిత్ ని కోరారు నాగ్. అభిజిత్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా చూస్తే మాస్టర్ కు నాకు అస్సలు పడటం లేదు. ఆయన ఒకరు చెప్పింది వినరు. తను చెప్పిందే కరెక్ట్ అంటారు. 30ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు. కానీ ఎదుటివారు ఎందుకు చెబుతున్నారు అనే దాని గురించి మాత్రం కొంచెం కూడా ఆలోచించరు. అది నాకు అస్సలు నచ్చడం లేదు అని అభి తెలిపారు.
అభిజిత్ కు నాగ్ కౌంటర్
మొదటి నుంచి నువ్ అదే చెబుతున్నావ్ అభి.. కానీ ఆయన ఎందుకు అలా అవుతున్నారు. లేదా పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారు.. ఆయన కెప్టెన్. పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఫాలో అవ్వాలి అని నాగ్ ప్రశ్నించారు. వింటాను సార్ అని చెప్పిన అభిజిత్ తప్పకుండా ఆయన చెప్పిన మాట వింటాను. ఇంగ్లీష్ లో మాట్లాడినందుకు పనిష్మెంట్ ఇచ్చారు. అది సడన్ గా అంటే కొంచెం కష్టమని అనిపించిందని అభి వివరణ ఇచ్చారు.
మిగతా వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా?
ఫైనల్ గా అభి ఇచ్చిన సమాధానాలకు తగ్గట్లుగా నాగ్ చురకలు అంటించారు. నీలాగే మాస్టర్ కి కూడా 30 ఏళ్ల నుంచి అలానే ఉంటున్నారు. ఆయనకు కూడా మారడానికి టైమ్ పడుతుంది. నామినేషన్స్ టాస్క్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ కారణం చెప్పి వెళ్లిపోయావ్. మిగతా వాళ్ళకు అది లేదా. వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడ్డారు అని నాగార్జున అభిజిత్ కు కౌంటర్ ఇచ్చారు.
అభిజిత్ చేసింది కరెక్ట్ కాదు
ఇక అభిజిత్ మళ్ళీ సమాధానం ఇస్తూ.. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నా గురించి మాత్రమే చెప్పాను సర్ అని వివరణ ఇవ్వగా.. సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంతో టాస్క్ నుంచి వెళ్లిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నాగ్ హౌజ్ మెంట్స్ ని ప్రశ్నించగా ఒక్కరు కూడా అభిజిత్ చేసింది కరెక్ట్ అని చెప్పలేకపోయారు. ఆఖరికి హారిక కూడా అభిజిత్ చేసింది ఎంతమాత్రం కరెక్ట్ కాదని చెప్పడంతో అభిజిత్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు.