ఆటంబాంబు ఇచ్చినా అరియానా పడదు.. అవినాష్ పరువుదీసిన నాగార్జున
బిగ్ బాస్ షోలో పదో వారం కూడా ముగిసేందుకు వచ్చింది. నేటి వీకెండ్ ఎపిసోడ్ మొత్తం దీపావళి సెలెబ్రేషన్స్‌తో గడిచేలా ఉన్నాయి. వార్నింగ్‌లు, అలకలు, కోపాలు, క్లాసులు పీకడం లాంటివి ఏమీ లేనట్టుకనిపిస్తున్నాయి. అందరినీ పండుగ మూడ్‌లోనే ఎంటర్టైన్ చేయనున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ఒక్కొక్కరినీ వేరే లెవెల్‌లో ఆడుకున్నాడు. అందరికీ వరుసగా కౌంటర్లు వేసేశాడు.

దీపావళి గిఫ్ట్‌లు..
కంటెస్టెంట్ల కోసం మనాలి నుంచి నాగార్జున గిఫ్ట్‌లు తీసుకొచ్చాడు. ఇంటి దగ్గరి నుంచి దీపావళి గిఫ్ట్‌లు వచ్చాయి. దాంతో పాటు అమల కూడా కంటెస్టెంట్ల కోసం స్పెషల్ గిఫ్ట్స్‌ను పంపించిందని తెలిపాడు. అమల పంపించిందని తెలియడంతో అందరూ ఎగిరి గంతేశారు.

లాస్యను ఏడిపించాడు..
లాస్యను ఆంటీ ఆంటీ అంటూ సోహెల్ ఏడిపించిన విషయాన్ని నాగార్జున గుర్తు చేశాడు. ఆ విషయాన్ని ప్రస్థావిస్తూ లాస్యను పదే పదే ఆంటీ అని నాగ్ కూడా పిలిచాడు. సర్ మీరు కూడానా? అలా పిలవొద్దు సర్ అని బతిమిలాడింది. నువ్ ఏమో మమ్మల్ని చీమ ఏనుగు జోకులు చెప్పొచ్చు కానీ మేం అలా అనకూడదా? అని నాగ్ కౌంటర్ వేశాడు.

హారికను ఇమిటేట్..
ఇక హారికను నాగార్జున బాగానే ఇమిటేట్ చేశాడు. టపాసులతో ఇంటి సభ్యులను పోల్చాల్సి ఉండగా.. హారిక ఏ క్రాకర్స్‌ను ఎవరితో పోలుస్తుందో చెప్పమని నాగ్ టాస్క్ఇచ్చాడు. హారిక మ్యానిరిజాన్ని నాగ్ ఇమిటేట్ చేయడంతో అందరూ పగలబడి నవ్వేశారు.

న్యూయార్క్ ఘటన..
అభిజిత్ గే బార్ ఘటనను గుర్తు చేస్తూ నాగార్జున కౌంటర్ వేశాడు. అమ్మాయిలకే కాదు నాక్కూడా బటర్ వేస్తావా? నాకేందుకు డౌట్ వస్తోంది.. న్యూయార్క్ ఘటన తరువాత అని చెప్పడంతో అందరూ నవ్వేశారు. మొత్తానికి అభిజిత్ గే బార్‌లోకి వెళ్లడం బాగానే వైరల్ అయిందన్నమాట.
Recommended Video

నీకు పడదు..
టాస్క్‌లో భాగంగా అరియానాకు ఆటంబాంబ్‌ను సింబాలిక్‌గా అవినాష్ ఇచ్చాడు. నువ్ ఆటంబాంబ్ ఇచ్చినా అరియానా నీకు పడదు అంటూ అవినాష్ గాలి తీసేశాడు నాగార్జున. మధ్యలో మెహబూబ్‌ను కూడా నాగార్జున లాగాడు. అవును సర్ ఏదో ట్రై చేస్తున్నాడంటూ అవినాష్‌ను ఇరికించే ప్రయత్నం చేశాడు మెహబూబ్. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో ఓన్లీ ఫన్ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











