హారిక-అభిజిత్‌లను నిలబెట్టి మరీ పరువుదీశాడు.. నాగార్జున మంచి ఫైర్ మీదున్నాడు!

బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌ను చూసే ప్రేక్షకులకు కొన్ని అనుమానాలు వస్తుంంటాయి. వచ్చి తీరాలి కూడా. మనం చూసేది తెలుగు బిగ్ బాసేనా? అని కచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తెలుగు రాని వాళ్లను తీసుకురావడం ఓ పొరపాటు అనుకుంటే.. తెలుగులో గలగల మాట్లాడే సత్తా ఉన్న కంటెస్టెంట్లు కూడా ఇంగ్లీష్ లేదా హిందీలో ఊదరగొడుతున్నాడు. ఈ విషయంలో ఈ సారి బిగ్ బాస్ కేర్ లెస్‌గానే ఉన్నట్టు కనిపిస్తోంది. కంటెస్టెంట్లలో కొందరు తెలుగు మాట్లాడాలనే నియమాన్ని ఉల్లంఘిస్తున్నా ఏమీ అనడం లేదు. కానీ నాగార్జున మాత్రం ఉతికి ఆరేసేందుకు రెడీ అయ్యాడు.

గరం గరం మీదున్న నాగ్..

గరం గరం మీదున్న నాగ్..

బిగ్‌బాస్ షోలోనాల్గో వారాంతంలో నాగార్జున గరంగరం ఉన్నట్టున్నాడు. కిల్లింగ్ కాయిన్స్ టాస్క్‌లో గ్రూపులు కట్టి ఆడటం, బిగ్ బాస్ హెచ్చరించిన తరువాత కూడా మళ్లీ అలానే ఆడటంపై నాగార్జున ఫైర్ అవుతున్నాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరి ఆట వాళ్లు ఆడకపోతే.. కథ వేరేలా ఉంటుందని సోహెల్ స్టైల్లో చెప్పాడు.

మోనాల్ అలా..

మోనాల్ అలా..

నాల్గో వారంలో ముఖ్యంగా జరిగినవి టాస్క్, బిగ్ బాస్ హెచ్చిరకలు. తెలుగులో మాట్లాడండి.. అంటూ మోనాల్‌ను హెచ్చరించడం. తన బాధను చెప్పుకుంటూ హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడటంపై బిగ్ బాస్ ఫైర్ అయ్యాడు. తెలుగులో మాట్లాడమని అనేసరికి బాత్రూంలోకి వెళ్లి ఏడ్చింది. అయితే నాగార్జున ముందు మాత్రం తెలుగులోఓ ర్యాప్ పాడింది. నోయల్ బాగానే బట్టి పట్టించినట్టున్నాడు.

అభి, హారికలు ఇలా..

అభి, హారికలు ఇలా..

తెలుగు రాకున్నా మోనాల్ ప్రయత్నిస్తోందని, వచ్చిన మీ ఇద్దరు మాత్రం ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటున్నారని అభిజిత్, హారికలను నిలబట్టి పరువుతీశాడు. అభి ఏదో సమాధానం చెప్పేందుకు ట్రై చేశాడు గానీ నాగ్ వినలేదు. అయితే ప్రోమోలో ఇంపాక్ట్ బాగానే కనిపిస్తోంది. తీరా ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో చూడాలి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!

అసలు జరిగిందేంటంటే..?

కిల్లర్ కాయిన్స్ అనే టాస్క్‌లో అభి, స్వాతి కలిసి ఆడటం, అభి తన కాయిన్స్‌ను స్వాతికి ఇస్తాను అనడంతో హారిక హర్టైంది. ఈ విషయంలో అభితో హారిక ముచ్చటించింది. ఆ సమయంలో ఇద్దరూ ఇంగ్లీష్‌లోనే తమ సంభాషణలు పెట్టుకున్నారు. ఇదే కాదు చాలా సందర్భాల్లో వీరిద్దరు ఇంగ్లీష్‌లోనే ముచ్చటించుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X