పుచ్చ పగిలిపోద్దా.. మెడపట్టుకుని బయటకు గెంటేస్తారు.. మెహబూబ్‌కు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బిగ్ బాస్ షోలో నాగార్జున నిన్న విశ్వరూపం చూపించాడు. ఐదో వారంలో జరిగిన ఒక్కో ఘటనను గుర్తు చేస్తూ ఒక్కొక్కరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి రిపీట్ చేస్తూ కొరడా ఝులిపించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరినీ ఒక్కో లెవెల్ ఆడుకున్న నాగ్.. మెహబూబ్‌కు మాత్రం గట్టిగా ఇచ్చిపడేశాడు. ఇంకోసారి అలా మాట్లాడితే బాగుండని హెచ్చరించాడు. కానీ చివరకు మళ్లీ మెహబూబ్ చేసిన పనికి మెచ్చుకున్నాడు.

హోటల్ టాస్క్‌లో..
హోటల్ టాస్క్‌లో మెహబూబ్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పుచ్చ లేచిపోద్ది అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. మొదటి సారి మామూలుగానే అన్న మెహబూబ్ రెండో సారి మరింతగా ఫైర్ అయ్యాడు. అలాంటి మాటలు మాట్లాడకంటూ అఖిల్ చెప్పినా వినలేదు.. ఎవ్వడికైనా సరే పుచ్చ పగిలిపోద్ది అంటూ ఓ రేంజ్‌లో అరిచేశాడు.

ఇంట్లో కూడా ఇలాగేనా?
పుచ్చ పగిలిపోద్దా? ఎవరిది? అంటూ నాగార్జున ఫైర్ అయ్యాడు. ఇంట్లో, దగ్గరి వారితో నీ ఫ్రెండ్స్‌తో అలాంటి మాటలే మాట్లాడతావా?అని నాగ్ ప్రశ్నించాడు. అది తాను మామూలుగా అన్నానని, తన ఫ్రెండ్స్‌తో సాధారణంగానే అంటానని మెహబూబ్ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. రెండో సారి కూడా అదే విధంగా రెచ్చిపోయావ్ ఎందుకు అంటూ తిరిగి నాగ్ ప్రశ్నించాడు.

మెడ పట్టుకుని..
అలా బయట హోటల్లో మాట్లాడితే మెడ పట్టుకుని బయటకు గెంటేసి వందకు ఫోన్ చేసి మోకాళ్ల చిప్పలు విరగొట్టిస్తారు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి అలా జరగదు సర్, జాగ్రత్తగా ఉంటానని మెహబూబ్ సైలెంట్ అయిపోయాడు.

సోహెల్, అఖిల్‌లకు కితాబు..
అంత జరిగిన తరువాత సోహెల్ ఓ ఫ్రెండ్‌గా సలహా ఇచ్చిన తీరు.. అలా అనడం తప్పు క్షమించమని అడుగుపో అని చెప్పడం, అఖిల్ కూడా మంచి మాటలు చెప్పడం బాగుందని కితాబిచ్చాడు. మెహబూబ్‌కు ఆ ఇద్దరూ నిజమైన ఫ్రెండ్స్ అన్నట్టుగా నాగ్ చెప్పుకొచ్చాడు.
Recommended Video

సండే ఫండే..
ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తే సండే ఫండేగా మారినట్టు కనిపిస్తోంది. ఒక్కొక్కరిని తెలుగు సినిమా హీరోలు, పేర్లు, టైటిల్స్, డైలాగ్స్‌తో ఇమిటేట్ చేయించినట్టు తెలుస్తోంది. ఇక అర్జున్ రెడ్డిగా అఖిల్, రేసుగుర్రం బన్నీగా మెహబూబ్ నటించి ఫన్ క్రియేట్ చేశాడు.


Click it and Unblock the Notifications











