Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాగ్.. కంటెస్టెంట్లు ఫుల్ ఖుషీ
బిగ్ బాస్ షోలో పదో వారం మటన్ గురించి ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. రేషన్ మేనేజర్‌గా ఉన్న అవినాష్ అజాగ్రత్త వల్ల రెండు కిలోల మటన్ పాడైపోయింది. ఇక ఇంట్లో మటన్ వండుతారని ఎంతో ఆశపడి ఎక్స్ ట్రా జిమ్ కూడా చేశారు సోహెల్ మెహబూబ్. కానీ చివరకు అవినాష్ చేసిన పని వల్ల ఇంట్లో మటన్ మొత్తం వేస్ట్ అయింది. ఈ విషయంలో ఇంటి సభ్యులందరూ అవినాష్‌ను టార్గెట్ చేశారు. నామినేట్ చేసేస్తామని బెదిరించారు.
సోహెల్ మెహబూబ్ ఇద్దరూ కూడా అవినాష్‌ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. అవినాష్‌ను పట్టి పీడించారు. స్మిమ్మింగ్ పూల్‌లో పడేసి మరీ చిత్ర హింసలు పెట్టారు. అందరూ కలిసి కుమ్మేశారు. అంతే కాకుండా అవినాష్ ఎగ్స్ అన్నీ లాగేసుకున్నారు. మళ్లీ ఆ ఎగ్స్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోలేదని మండిపడ్డారు. అలా మటన్ కోసం అవినాష్‌ను ఓ ఆటాడుకున్నారు. అవినాష్ బిగ్ బాస్‌ను ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా మటన్ మాత్రం ఇవ్వలేదు.
పైగా మటన్ రేటును 2000కు పెంచాడు. వాళ్లకు ఇచ్చిన లగ్జరీ పాయింట్స్ 1600.. మటన్ రేటు 2000 పెట్టడంతో మళ్లీ అవినాష్ మీద విరుచుకపడ్డారు. వీరి బాధను భరించలేక అవినాష్ నాగార్జునను వేడుకున్నాడు. ఓ కేజీ మటన్ పంపించండి సర్ వీళ్లు నన్ను ఆడుకుంటున్నారు అని ప్రాధేయపడ్డాడు. సరే ఓ కేజీ మటన్ పంపిస్తాను అని మాటిచ్చాడు. చెప్పినట్టుగానే నాగార్జున మటన్ పంపించాడు. దీంతో కంటెస్టెంట్లందరూ ఫుల్ ఖుషీ అయ్యారు.