వామ్మో అదంతా నిజమేనా.. అందరికీ ఇచ్చి పడేస్తున్నాడు.. కొరడా ఝులిపిస్తోన్న నాగ్!!
బిగ్‌బాస్ ఐదో వారంలో నాగార్జున కాస్త కోపంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా బాగానే సీరియస్ అవుతోన్నట్టు ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు. ప్రోమోలు పీక్స్‌లో ఉండటం, ఎపిసోడ్‌లు వీక్‌గా ఉండటం అందరికీ తెలిసిందే. అయితే ఈ వారాంతంలో నాగార్జున అందరిపై బాగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నామినేషన్ ప్రక్రియలో జరిగిన తప్పులు, టాస్క్‌లో చేసిన ఓవర్ యాక్షన్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో అభిజిత్, సోహెల్, అఖిల్, మెహబూబ్ ఇలా అందరిపై కొరడా ఝులిపించాడు.

నామినేషన్ ప్రక్రియపై..
నామినేషన్ ప్రక్రియలో అభిజిత్ అఖిల్ మధ్య జరిగిన వాగ్వాదం గురించి నాగ్ ప్రస్థావించినట్టు తెలుస్తోంది. మధ్యలో మోనాల్ విషయం ఎందుకు తీశావ్ అంటూ అఖిల్‌కు, ఆ టాపిక్ ఎందుకు కంటిన్యూ చేశావ్ అని అభిజిత్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు.

దివిపై ఫైర్ అవ్వడంతో...
నామినేషన్ ప్రక్రియలో దివిపై అరవడం, టాస్క్ విషయంలోనూ సోహెల్ విషయాన్ని ప్రస్థావిస్తూ యాంగర్ పీక్స్ చేరుకుంటోందని ఎక్కడికో వెళ్తోందని, అమ్మాయిల మీదకు ఇంకోసారి వెళ్తే కొరడా ఝులిపించాల్సి వస్తుందని నాగ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

పుచ్చ పగిలిపోద్ది..
హోటల్ టాస్క్‌లో మెహబూబ్ చేసిన అతి గురించి చెప్పాల్సిన పనే లేదు. పుచ్చ లేచిపోద్ది అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. ఆ మాటలు ఏంటి? బయట హోటల్‌కు వెళ్లి అలా అరిస్తే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు అంటూ మెహబూబ్‌కు నాగ్ గట్టిగానే ఇచ్చి పడేశాడు.
ప్రోమోలో బాగానే సీరియస్..
ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోల్లో నాగ్ బాగానే సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. మూడ్ కూడా అలాగే ఉంది. ఎపిసోడ్ కూడా వేడి వేడిగా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రోమోలు మాత్రమే ఈ రేంజ్‌లో ఫైర్ మీద ఉంటాయా? ఎపిసోడ్ మొత్తం ఇలానే ఉంటుందా? అన్నది చూడాలి.

గంగవ్వ అవుట్..
ఇక గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు గంగవ్వ బిగ్ బాస్, నాగార్జునలతో తన గోడును వెల్లిబుచ్చుకున్న ప్రోమో అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో గంగవ్వ ఇంటి నుంచి విడుదల కాబోతోంది.

వెళ్లిపోతానంటూ..
ఇక తన వల్ల కాదు ఇంకో రెండు వారాలు ఉండాలని అనుకున్నాను కానీ ఉండలేకపోతున్నాను అంటూ గంగవ్వ ఏడ్చేసింది. డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లు పట్టుకున్న నాగ్.. గత వారం నుంచి గంగవ్వకు ఆరోగ్యం బాగా లేదు,.. వెళ్లడానికి పర్మిషన్ ఇస్తారా బిగ్ బాస్ అంటూ అడిగేశాడు.

కన్నీరుపెట్టేశారు..
గంగవ్వపై ప్రోమో రాకముందే మ్యాటర్ లీకైంది. గంగవ్వ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిందన్న వార్త వైరల్ అయిపోయింది. అయితే గంగవ్వ బయటకు వెళ్లిపోతోందన్న వార్త తెలిసిన ఇంటి సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గంగవ్వ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో నోయల్, అఖిల్, హారిక, సుజాత, లాస్య లాంటి వాళ్లు భోరున ఏడించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











