ఆమెతో ఏదో చేస్తున్నావ్, వీడియోలు బయటపెట్టాలా.. నాగ్ మాటలకు లబోదిబోమన్న అవినాష్, అరియా

బిగ్ బాస్ షో మొదట్లో కాస్త డల్ గానే మొదలైనప్పటికి రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. నాగార్జున ప్రతి శనివారం వస్తే మరింత రసవత్తరంగా మార్చుతున్నారు. ముఖ్యంగా ఎలిమినేషన్ వ్యవహారంలో ఆయన ఫాలో అవుతున్న మార్గాలు ఊహించని ట్విస్ట్ లను తలపిస్తున్నాయి. మరోవైపు నాగార్జున కంటెస్టెంట్స్ లలో ఉత్సాహం నింపడమే కాకుండా వారిపై జోక్స్ వేస్తూ సెటైర్ లు కూడా వేస్తున్నారు. రీసెంట్ గా అవినాష్ ని అలాగే అరియానాలను కూడా ఒక ఆటాడుకున్నారు.

ఓ ఆటడుకున్న నాగార్జున

ఓ ఆటడుకున్న నాగార్జున

దోషి టాస్క్ క్రియేట్ చేసిన నాగార్జున కంటెస్టెంట్స్ ల యొక్క అసలు రంగులను బయటకు తీశారు. కంటెస్టెంట్స్ లో గేమ్ స్పిరిట్ సింపుతూనే ప్రతి ఒక్కరి మధ్య పోటీ తత్వం ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఇక అవినాష్‌, అరియానాలను ఓ ఆట ఆడుకున్నాడు నాగార్జున. ముఖ్యంగా టాస్క్ లో భాగంగా అవినాష్‌ పై ఊహించని సెటైర్స్ వేశారు.

ఏదైనా సైన్‌ లాంగ్వేజ్‌ క్రియేట్ చేస్తున్నావా

ఏదైనా సైన్‌ లాంగ్వేజ్‌ క్రియేట్ చేస్తున్నావా

మొదట టాస్క్ లో దివి దోషిగా, అవినాష్‌ స్టేషన్‌ మాస్టర్‌గా ఉండగా దివిపై పలు ఆరోపణలు వచ్చాయి. దివి ఆటకు న్యాయం చేయలేకపోయిందని తీర్పును పొందింది. ఇక ఆ గేమ్ పూర్తవ్వగానే ఈ మధ్య ఏదో సైన్‌ లాంగ్వేజ్‌ క్రియేట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది అని అవినాష్‌పై నాగార్జున చేసిన కామెంట్స్ ఒక్కసారిగా హౌజ్ లో అందరు ఆశ్చర్యపోయారు.

ఐ లవ్యూ అని రాశావని తెలిసింది

ఐ లవ్యూ అని రాశావని తెలిసింది

సీసీ కెమెరాలు నువ్వు చేసే ప్రతిదీ తెలిసిపోతుందని చెప్పిన నాగ్ సోఫాపై ఏం రాశావో చెప్పాల్సిందే అంటూ నాగ్ గట్టిగా ఆరా తీయడంతో అవినాష్ ఆందోళన చెందారు. అయ్యో అలాంటి దేమి లేదు సార్ అంటూ బుకాయించాడు అవినాష్. ఇంతలో నాగ్‌ ఐ లవ్యూ అని రాశావని తెలిసింది. నువ్వు చేసిన వీడియోలు బయటపెట్టమంటావా అనగానే ఒక్కసారిగా అంతా షాక్‌ అయ్యారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 16 Highlights,అరియానా Vs సోహైల్..కత్తులు దూసుకొన్న సెలబ్రిటీలు!
లబోదిబోమన్న అవినాష్

లబోదిబోమన్న అవినాష్

సార్ నా కొంప ముంచకండి అలాంటిదేము లేదు. అసలు ఏమి లేదు అంటూ అవినాష్ చెప్పగా.. నాగ్ మాట్లాడుతూ.. ఏమి లేదా నిజంగా ఏమి లేదా? అవినాష్ కి పిల్లని ఇచ్చే వారు ఒకసారి ఇది గమనించండి అంటూ చెప్పడంతో అవినాష్ లబోదిబోమన్నాడు. అలాగే అరియానా కూడా సార్ నాకు అతనితో ఎలాంటి రిలేషన్ లేదని ఆందోళన చెందడంతో వెంటనే నాగార్జున జస్ట్ జోక్ చేశానని అందరిని కూల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X