Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ఒక్క సీన్‌తో అందరూ ఫిదా.. అభిజిత్-హారిక రిలేషన్‌పై నెటిజన్ల కామెంట్స్
బిగ్‌బాస్ షో మూడో సీజన్లో పునర్నవి-రాహుల్ ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అది స్నేహమా? ప్రేమా? స్నేహం కంటే ఎక్కువా? ప్రేమ కంటే తక్కువా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య ఆడియెన్స్ వదిలేశారు. అయితే అలా ఇద్దరూ కలిసి షోలో ఎంటర్టైన్ చేశారు. ప్రేక్షకులను వారి కెమిస్ట్రీతో కట్టిపడేశారు. అలా ప్రతీ సారి సాధ్యకాకపోవచ్చు. ఈ నాల్గో సీజన్లోనూ అలాంటి జంటే ఒకటి వస్తున్నట్టు కనిపిస్తోంది.
అదే స్ట్రాటజీ..
అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్లు రాహుల్-పునర్నవి ఫార్మూలాను వాడాలని ప్రయత్నిస్తున్నారో ఏమో కచ్చితంగా చెప్పలేం. కానీ లవ్ ట్రాక్‌లు మాత్రం బాగానే నడుస్తున్నాయి. పులిహోర కలిపేందుకు చాలా మంది ట్రై చేస్తూనే ఉన్నారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేసే పనిలోనే పడ్డారు అందరూ.
అభిజిత్ స్పెషల్..
నాల్గో సీజన్‌కు మన్మథుడు అభిజిత్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. కనెక్షన్ గేమ్ అంటూ మొదట్లో హారికతో కనెక్ట్ అయ్యాడు. మోనాల్ ఫోటో చూపెట్టడంతో పెళ్లి చేసుకుంటానని అక్కడ బుక్కయ్యాడు. అలా ఆ ఇద్దరితో చాలా క్లోజ్ అయ్యాడు. మధ్యలో మోనాల్‌తో గొడవలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.
వారితో కూడా..
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ కూడా అభితోనే ఎక్కువగా ఉంటోంది. ఉక్కు హృదయం టాస్క్ అనంతరం.. దివి కూడా అభితో ఎక్కువగా క్లోజ్ అయింది. దివి, అభి, హారికలు కలిసి ముచ్చటించుకుంటున్నారు. ఇలా ఈ ముగ్గురికి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. ఇలా ముగ్గురు కలిసి ఉంటే బాగుంటుందని అంటున్నారు.
హారికతోనే స్పెషల్...
అభితో ఎంత మంది ఉన్నా, మాట్లాడినా సరే హారికతో ఉండే రిలేషన్ షిప్ వేరే లెవెల్. టాస్కుల్లో అయినా సరే ఏదైనా గొడవల్లో అయినా సరే అభికి అండగా నిలుస్తుంది హారిక. అభి కోసం హారిక వాగ్వాదానికి దిగుతుంది. మొన్నటి కిల్లర్ కాయిన్స్ టాస్క్‌లో అభి స్వాతితో కలిసి ఆడటంతో కాస్త హర్టైంది. కానీ అభి సారి చెప్పేసరికి మళ్లీ కూల్ అయింది.
ప్రేమగా హత్తుకున్నాడు..
నిన్నటి ఎపిసోడ్లో హారిక జైలు ఏరియా వద్ద సీతాకోక చిలుకను తీక్షణంగా గమనిస్తూ ఉంది. వెనుక నుంచి అభి వచ్చి భయపెట్టేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆపై మళ్లీ అభి వచ్చి.. వెనకాల నుంచి హారికపై చేతులేశాడు. ఆ తరువాత ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకున్నారు. అలా చేతులు వేసిన సీన్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. వారిద్దరి బాండింగ్ గ్రేట్, మంచి రిలేషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.