దేవుడా.. దేవీ నాగవల్లిలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆశ్చర్యంలో నెటిజన్స్

బిగ్‌బాస్ హౌస్‌లో సండే కాస్త ఫండేగా మారబోతోంది. కంటెస్టెంట్లతో ఆటలు ఆడించి, డ్యాన్సులు చేయించి వినోదాన్ని పంచేందుకు నాగార్జున భారీగానే ప్లాన్లు వేసినట్టున్నాడు. ఈ క్రమంలోనే హౌస్‌మేట్స్ అందరితో దుమ్ములేచిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు పెట్టించాడు. ఇక ఈ డ్యాన్సులకు సంబంధించిన ప్రోమోను చూస్తుంటూనే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. మరీ ముఖ్యంగా దేవీ నాగవల్లి మాస్ స్టెప్పులను చూసి అందరూ బిత్తరపోతోన్నారు.

పర్‌ఫెక్ట్ అంటూ..

పర్‌ఫెక్ట్ అంటూ..

అసలే శనివారం నాటి ఎపిసోడ్‌లో దేవీ నాగవల్లికి పర్‌ఫెక్ట్ అంటూ ఓ ట్యాగ్‌ను ఇచ్చిపడేశారు. అయితే ఆ ట్యాగ్‌కు ఆమె యాప్ట్. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో ఆమె తలదూర్చదు. ఏ విషయాన్ని అంతగా లాగడం, సాగదీయడం ఇష్టముండదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది.

ఆలోచనలోనూ అంతే..

ఆలోచనలోనూ అంతే..


దేవీ నాగవల్లి ఆలోచనలు ఇంటి సభ్యులందరి కంటే భిన్నంగా ఉంటాయి. అందరూ కట్టప్ప కోసం కొట్లాడుతుంటే.. చాలా సింపుల్‌గా ఆ విషయాన్ని తేల్చిపడేసింది. అసలు బిగ్‌బాస్‌లో కట్టప్ప లేనే లేడని క్లారిటీ ఇచ్చేసింది. ఆమెకున్న ఆ ముందు చూపు, విశ్లేషణా శక్తి ఆమెను భిన్నంగా నిలబెట్టాయి

ఇక మరో యాంగిల్..

ఇక మరో యాంగిల్..


ఇంత వరకు దేవీ నాగవల్లి అంటూ న్యూస్ హెడ్‌లైన్స్, కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రమే తెలుసు. కానీ ఆమె ఊర మాస్ స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కానీ తాజాగా బిగ్‌బాస్ వేయించాడు. సండేను ఫండేగా మార్చేందుకు హౌస్ మేట్స్‌తో నాగ్ స్టెప్పులు వేయించాడు.

దేవీ మాస్ స్టెప్పులు..

దేవీ మాస్ స్టెప్పులు..

దేవీ నాగవల్లితో డ్యాన్స్ చేసేందుకు జోడిగా అబ్బాయిలు ఎవ్వరూ రానట్టు కనిస్తోంది. ఇక చివరగా అభిజీత్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి సీటీమార్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక కళ్లన్నీ దేవీ నాగవల్లి వైపే చూసేలా ఉన్నాయి. దేవి వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. మీమ్స్, ట్రోల్స్, పొగడ్తలతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Vadthya మాస్.. అవి కొంచమ్ తగ్గించుకుంటే మంచిది..!!
సూర్య కిరణ్ అవుట్..

సూర్య కిరణ్ అవుట్..

ఇక మొదటి వారం ఎలిమినేషన్‌లో భాగంగా సూర్య కిరణ్ బిగ్‌బాస్ ఇంటి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మేరకు లీకులు ఉదయం నుంచి తెగ ప్రసారం అవుతున్నాయి. మరి నిజంగానే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడా? లేదా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X