Bigg boss 4: నాగార్జున స్థానంలో హోస్ట్‌గా ఆమెనా.. ఇది నమ్మేలా ఉందా?

బిగ్ బాస్ మొదలైనప్పుటి నుంచి కూడా షో ఎండ్ అయ్యే వరకు సాఫీగా కొనసాగుతుందా లేదా అనే రూమర్లు చాలానే వచ్చాయి. ముఖ్యంగా హోస్ట్ విషయంలో అనేక రకాల గాసిప్స్ ఒక విధంగా అభిమానులను షాక్ కి గురి చేశాయనే చెప్పాలి. ఎందుకంటే నాగార్జున త్వరలో షూటింగ్ లో బిజీ కానుండడం వలన బ్రేక్ ఇవ్వనున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇక ఆయన స్థానంలో రకరకాల పేర్లు ట్రెండ్ అయ్యాయి. ఫైనల్ గా ఇప్పుడు మరో కొత్త పేరు ట్రెండ్ అవుతోంది. కానీ అది అసలు నమ్మేలా లేదు.

ఛాలెంజింగ్ గా తీసుకున్న నాగార్జున

ఛాలెంజింగ్ గా తీసుకున్న నాగార్జున

గడిచిన మూడు సీజన్స్ లకు మంచి రేటింగ్స్ అయితే వచ్చాయి. హోస్ట్ విషయంలో హీరోలు తగిన న్యాయం చేశారు. ఎన్టీఆర్, నాని తరువాత నాగార్జున ఎక్కువగా ఒత్తిడికి లోను కాకుండా ఛాలెంజింగ్ గా తీసుకొని హోస్టింగ్ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. అయితే ఇటీవల ఆయన షోకు రెండు వారాలు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రూమర్స్ రాగా ఆ మరుసటి వారమే మళ్ళీ ఆయనే వచ్చి రూమర్స్ కి ఎండ్ కార్డ్ పెట్టారు.

 వాటిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు

వాటిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు

నాగార్జున బ్రేక్ ఇస్తే ఆయన స్థానంలో అనుష్క వచ్చే అవకాశం ఉందని ఆ తరువాత మళ్ళీ నానిని కూడా రంగంలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు గాసిప్స్ వచ్చాయి. అదే విదంగా గత ఎడాది మాదిరిగా రమ్యకృష్ణను అయినా రంగంలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ వాటిపై ఇంతవరకు బిగ్ బాస్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు.

 నాగ్ స్థానంలో జబర్దస్ట్ రోజా

నాగ్ స్థానంలో జబర్దస్ట్ రోజా

అసలైతే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఒక స్పెషల్ టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకోసం వారంలో 5రోజులు సారిపోవని మిగతా రోజుల్లో కూడా షూటింగ్ చేయాల్సిందేనని చిత్ర నిర్మాతలు కోరడంతో నాగ్ బిగ్ బాస్ షోకు దురమవ్వాలని డిసైడ్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక ఆయన స్థానంలో ఇప్పుడు జబర్దస్ట్ జడ్జ్ రోజా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కొత్త కథలు హాట్ టాపిక్ గా మారాయి.

Recommended Video

Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
ఈ బిజీ షెడ్యూల్ ని ఆయన ఎలా మ్యానేజ్ చేస్తారో?

ఈ బిజీ షెడ్యూల్ ని ఆయన ఎలా మ్యానేజ్ చేస్తారో?

జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి షోలతో ఆకట్టుకున్న రోజా అందుకు విభిన్నమైన బిగ్ బాస్ షోను ఎలా డీల్ చేస్తుందనేది చాలా మందిలో సందేహాన్ని కలిగిస్తోంది. నిజానికి ఇది నమ్మలేని విధంగా ఉంది. రోజా స్టైల్ కి బిగ్ బాస్ ఏ మాత్రం సెట్టవ్వదని కామెంట్స్ చేస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో పాటు మరో సినిమాను కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బిజీ షెడ్యూల్ ని ఆయన ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X