నువ్వు నా పక్కనే ఉండాలి, నా మెడిసిన్ నువ్వు.. ట్రయాంగిల్ లవ్ స్టొరీలో మరో ట్విస్ట్ ఇచ్చిన మోనాల్
బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి మంచి ట్విస్టులతో ఒక ట్రాక్ లోకి వచ్చేసింది. రోజురోజుకు షోకి సంబంధించిన స్టోరీలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. గడిచిన మూడు సీజన్లలో అనేక రకాల ప్రేమ కథలు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. కానీ ఈ సారి మాత్రం ట్రయాంగిల్ లవ్ స్టొరీ మాత్రం ఊహించని ట్విస్ట్ లతో వైరల్ అవుతోంది. మోనాల్, అభిజిత్, అఖిల్ లవ్ ట్రాక్ ఎక్కడికి వెళుతోందోనని సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తుండగా శనివారం ఎపిసోడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో వీరి ప్రేమ కథ మరో మలుపు తిరిగిందని అనిపిస్తోంది.

కథ క్లైమాక్స్ కి చేరుకునే లోపు..
షో మొదలైనప్పటి నుంచి హౌజ్ లో అఖిల్, మోనాల్ కి సంబంధించిన సీన్స్ ఎక్కువగా దర్శనమిచ్చాయి. ఇక అభిజిత్ వారి మధ్య దూరినట్లు కొన్ని సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎక్కువగా అఖిల్ మోనాల్ పై ఫోకస్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కథ క్లైమాక్స్ కి చేరుకునే లోపు అసలు మోనాల్ ఎవరిని లైక్ చేస్తుంది అనే పాయింట్ ని మాత్రం చాలా బాగా హైలెట్ చేశారు.

ఇద్దరితోను సరదాగా ఉంటూ..
దాదాపు ప్రేమదేశం లెవెల్లో హైప్ క్రియేట్ చేస్తున్న ఈ ముగ్గురు రోజుకో కామెంట్ తో నెటిజన్లని ఒక విధంగా కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నారనే చెప్పాలి. శనివారం ఎపిసోడ్ లో సీన్ ని చూస్తే గనక మోనాల్ ఇద్దరితోను నవ్వుకుంటూ ఉండడం అందరిని షాక్ కి గురి చేసింది. ఒక సోఫా దగ్గరగా పడుకొని ఉన్న మోనాల్ అఖిల్ తో మాట్లాడిన విధానం చూస్తే మొత్తానికి ఈ కథలో ఒక ట్విస్ట్ వచ్చినట్లు అర్ధమవుతోంది.

నా బతుకు ఎక్కడైనా ఇంతే: అఖిల్
మోనాల్, అఖిల్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అఖిల్ వచ్చి మోనాల్ కి కళ్ళు తుడుచుకొమ్మని టిష్యూస్ ఇస్తాడు. అప్పుడే మోనల్ అఖిల్ ని చూసి స్మైల్ ఇస్తుంది. దాంతో అఖిల్ తనను ఎవరు పట్టించుకోవడం లేదని, నా బతుకు బయటా ఇంతే, లోపలా ఇంతేనని వివరణ ఇచ్చాడు. అప్పుడు మోనల్ అలా సమాధానం ఇస్తూ.. నువ్వు నాకు స్పెషల్, నువ్వు నా పక్కన ఉంటే బావుంది. నువ్వే నా మెడిసిన్ అని క్లియర్ గా చెప్పేసింది.
Recommended Video

ఆ మెడిసిన్ డేట్ ఎండ్ అయ్యింది
అందుకు అఖిల్.. ఆ మెడిసిన్ డేట్ అయిపోయిందని సమాధానం ఇచ్చారు. ఆ ఒక్క సమాధానంతో మోనాల్ పై అఖిల్ తన ఆలోచనను బయటపెట్టేశాడు అనిపిస్తోంది. మోనాల్ ఒకరోజు అభిజిత్ తో ప్రేమగా ఉంటూ మరో రోజు అఖిల్ తో సన్నిహితంగా మాట్లాడుతూనే చివరికి ఇద్దరికి షాక్ ఇవ్వడం రొటీన్ గా నడుస్తోంది. ఇక నిన్న అఖిల్ తో ఆమె మాట్లాడిన విధానం చూస్తుంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో న్యూ ట్విస్ట్ ఎంతవరకు హైలెట్ అవుతుందో ఈ వారం తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











