ఐటెం రాణి అనడంతో హారిక ఏడ్చేసిందిట.. అలా మార్చేశానంటూ నోయల్ ఎమోషనల్ కామెంట్స్
బిగ్ బాస్ ఇచ్చే ట్యాగ్స్ ఒక్కోసారి వర్కవుట్ కాకపోవచ్చు. ఆ మధ్య బిగ్ బాస్ ఇంట్లో ఓ సినిమా తీశారు. ప్రేమ మొదలైంది అంటూ ఇంట్లో ఉన్న ప్రేమ జంటనే హీరో హీరోయిన్లుగా పెట్టి సినిమాను తీశారు. అయితే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లందరినీ ఏదో విధంగా వాడాలి కదా అంటూ ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు. డ్యాన్సులు బాగా వేస్తుంది కదా అని హారికకు ఓ ఐటం సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని తెలిపాడు.

కెవ్వు కేక అంటూ..
ప్రేమ మొదలైంది సినిమాలో సోహెల్, హారికలు ఇద్దరూ కూడా అమ్మ రాజశేఖర్ నేతృత్వంలో అదిరిపోయేలా డ్యాన్సులు చేశారు. అయితే వీరిని ఐటెం రాజా, రాణి అని సంబోధించడంపై హర్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా సోహెల్‌ను లాస్య పదే పదే ఆ ట్యాగ్‌తోనే పిలిచేది.

ఐటెం రాణి అంటూ అవార్డ్..
ఇక బీబీ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ అంటూ అందరికీ తమ తమ ప్రదర్శనను బట్టి అవార్డులను ప్రకటించారు. అందులో ఐటెం రాణి అవార్డును హారికకు ప్రధానం చేశారు. ఆ సమయంలో హారిక మొహం మాడిపోయినట్టు కనిపించింది. కంటిలో నీళ్లు వచ్చినట్టు కూడా కనిపించాయి.

చాలా ఏడ్చిందట..
ఐటెం రాణి అని బిగ్ బాస్ అనడం, అవార్డు ఇవ్వడంపై హారిక బాగా ఏడ్చేసిందట. నోయల్ ఓదార్చుతూ ఆ ఐటెం రాణి వేరే అర్థం వచ్చేలా మార్చేశాడట. అయినా ఎదుటి వాళ్లు ఎలా అనుకుంటున్నారన్నది ముఖ్యం కాదని, మనం ఏమనుకుంటున్నామన్నదే ముఖ్యమని ఓదార్చాడట. తాజాగా తన లగేజ్ బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చిందట.
Recommended Video

అందులో హారిక అలా చేసిందట..
రీసెంట్‌గానే నా లగేజ్ బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చింది. అందులో హారిక తన ప్యాంట్ ముక్కలు పెట్టింది. ఐటెం రాణి అవార్డును కూడా పంపించింది. ఆ అవార్డు వచ్చినప్పుడు ఏడ్చింది. అలా ఏడ్వడంతో ITEM పదంలోని TE అక్షరాలను తీసేసి అక్కడ లవ్ సింబల్ వేయడం ఐ యా రాణి అనే పదం వచ్చింది అని హారికను ఎలా బుజ్జగించాడో నోయల్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











