అమ్మ బాబోయ్ ఏం ఇచ్చాడ్రా.. అవినాష్, అమ్మ రాజశేఖర్‌ల పరువుదీసిన నోయల్

బిగ్ బాస్ ఎనిమిదో వారాంతం ఎపిసోడ్ ఓ రేంజ్‌లో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. నాగార్జున అసలే స్పెషల్ ఫ్లైట్‌లో మనాలి నుంచి హైద్రాబాద్ వచ్చేశాడు. బిగ్ బాస్ షో కోసం అక్కడి నుంచి ఇక్కడకు వచ్చాడు. గతవారం సమంత చేసిన మ్యాజిక్‌లోంచి ఇంకా అందరూ బయటకు రాలేకపోతున్నారు. ఇక నాగార్జున హోస్టింగ్‌లో ఇంటి సభ్యులకు ఎలాంటి క్లాసులు పీకుతాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్..

స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్..

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలికి వెళ్లిన నాగార్జున గత వారం బిగ్ బాస్‌కు డుమ్మా కొట్టేశాడు. దసరా స్పెషల్‌గా సమంతతో బిగ్ బాస్‌ను నడిపించారు. ఆ ఎపిసోడ్ బాగానే క్లిక్ అయింది. ఇక ఈ వీకెండ్‌ను నడిపించేందుకు నాగార్జున దిగాడు. ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్‌లో దిగాడు. బిగ్ బాస్ సెట్‌లో అడుగుపెట్టాడు.

నోయల్ ఫైర్ మీదున్నాడు..

నోయల్ ఫైర్ మీదున్నాడు..


అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నోయల్ ఎనిమిదో వారంలో బయటకు వెళ్లిపోయాడు. మొదటి వారం నుంచి తనను ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నా కూడా ఓపిగ్గా ఉంటూ వచ్చాడు. తనకున్న ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. అందుకే ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉండిపోయాడు. మధ్యలో నోయల్ అనారోగ్య సమస్యలపై అమ్మ రాజశేఖర్, అవినాష్ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.

నడకపై సెటైర్లు..

నడకపై సెటైర్లు..

అప్పుడెప్పుడో ఓసారి అవినాష్, అమ్మ రాజశేఖర్, సోహెల్, అఖిల్ ఇలా అందరూ ఓ చోట కూర్చున్న సమయంలో కొన్ని సెటైర్లు వేశారు. అందులో మరీ ముఖ్యంగా అవినాష్, అమ్మ రాజశేఖర్ నోయల్ పరిస్థితి, నడకపై కామెంట్లు చేశారు. నోయల్ ఎలా నడుస్తాడో చేసి చూపించారు. వాటిపై నోయల్ ఇప్పుడు ఫైర్ అయ్యాడు.

బయటకు వెళ్లాడు..

బయటకు వెళ్లాడు..


నోయల్ అనారోగ్య సమస్యలతో బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇప్పిస్తోన్న వైద్యం సరిపోదని, బయట స్పెషలిస్ట్‌లతో వైద్యం చేయించాని అందుకే బయటకు పంపిస్తున్నాని చెప్పాడు. త్వరగా కోలుకోవాలని మళ్లీ రావాలని బిగ్ బాస్ తెలిపాడు.

పరువుదీసిన నోయల్..


అయితే అలా బయటకు వెళ్లిన నోయల్‌ను నేడు నాగార్జున స్టేజ్ మీదకు తీసుకొచ్చినట్టున్నాడు. ఈ క్రమంలో నోయల్ అమ్మ రాజశేఖర్, అవినాష్‌ల పరువు తీసేశాడు. ఆ ఇద్దరిని లేచి నిల్చొని ఒంటి కాలితో నిలడమన్నాడు నోయల్. మీరు రెండు నిమిషాలు నిల్చొని ఉంటేనే అలా నొప్పి పెడితే.. నాకు దానికంటే వెయ్యి రెట్లు నొప్పి పెడుతుందని అన్నాడు. మీరు జోకరా?.. మీ ప్రవర్తనతో ఏం చెబుతున్నారు మాస్టర్ అంటూ అమ్మ రాజశేఖర్ పరువు తీశాడు. ఈ క్రమంలో అవినాష్ నోయల్ మధ్య గట్టి వాగ్వాదమే జరిగినట్టు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X