బిగ్‌బాస్ సారీ చెప్పాలట.. నోయల్ ప్రకృతి లాంటోడట.. వామ్మో రచ్చ మామూలుగా లేదుగా!!

బిగ్‌బాస్‌ను బెదిరించడం, వెళ్లిపోతా అని బ్లాక్ మెయిల్ చేయడం, బిగ్ బాస్ అయితే ఏంటి తొక్కా అని బిల్డప్‌లు ఇవ్వడం ప్రతీ సీజన్‌లో కామనే. మొదటి సీజన్‌లో శివ బాలాజీ బిగ్‌బాస్‌పై తిరుగుబాటు ప్రకటించాడు. వాటర్ సరిగా రావడం లేదని ఫైర్ అయ్యాడు. బయటకు వెళ్తానని గణేష్ ఏడ్వడం, ఇంట్లోనుంచి పోతానంటూ మహేష్ విట్టా బెదిరించడం అన్నీ చూశాం. తాజాగా నోయల్ కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.

అతనొక్కడే సక్సెస్..

అతనొక్కడే సక్సెస్..

బిగ్‌బాస్‌ను ఎదురించి సక్సెస్ అయింది కేవలం శివ బాలాజీ ఒక్కడే. ఇక మూడో సీజన్‌లో పునర్నవి, మహేష్ విట్టా కాస్త అతి చేశారు. కానీ చివరకు బిగ్‌బాస్ ముందు తలవంచేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నది బిగ్‌బాస్. ఆయన ఇంట్లో ఉంటే ఆయన్నే ఎదురిస్తే ఊరుకుంటాడా మరి.

తాజాగా నోయల్..

తాజాగా నోయల్..

ఇక నోయల్ కూడా బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యాడు. అసలు సంగతి ఏంటో తెలియదు గానీ.. నోయల్ మాత్రం నోరు పారేసుకున్నాడు. ముందు నుంచీ నోయల్ ఎంతో పకడ్భందీగా ఆడుతూనే ఉన్నాడు. ఎంతో కాలిక్యులేటెడ్‌గా ఆడుతూ వస్తున్నాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో మాత్రం నోయల్ రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది.

బిగ్‌బాస్ సారీ చెప్పాలి..

బిగ్‌బాస్ సారీ చెప్పాలి..

బిగ్‌బాస్ సారీ చెప్పాలని, ప్రకృతి ఎంత మంచిదో అంతే చెడ్డదని పెద్ద పెద్ద డైలాగ్‌లు కొట్టేశాడు. ఏది ఏమైనా సరే బస్తీ మే సవాల్.. ఈ వారం ఎలిమినేట్ అయినా పర్లేదు.. నాగార్జున సర్‌కు చెప్పి వెళ్లిపోతా అంటూ నోయల్ మస్త్ ఫ్ర్టస్టేట్ అవుతున్నాయి. మరి దీనికి కారణం ఏందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. అసలే ప్రోమోలకు, ఎపిసోడ్‌లకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటున్నాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 13 Highlights | బిగ్ బాస్ పనిష్మెంట్ | Filmibeat Telugu

నేటి నుంచి శిక్షలు..


నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ మొదటి సారిగా కంటెస్టెంట్లకు శిక్షలు విధించబోతోన్నాడు. తెలుగు మాట్లాడాలనే నిబంధనను పట్టించుకోకపోయినా ఇన్నాళ్లూ చూస్తుండిపోయాడు. కానీ నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లందరినీ ముప్పు తిప్పలు పెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. రూల్స్ బ్రేక్ చేస్తున్నారన్న కారణంతో గుంజీలు తీయించినట్టు ప్రోమోలో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X